AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhraptradesh: చిత్తూరు జిల్లాలో దారుణ ప‌రిస్థితులు.. రోడ్ల ప‌క్క‌న గుట్ట‌లు గుట్ట‌లుగా ‘ఏ’ గ్రేడ్ మామిడి పండ్లు

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు విప‌రీత‌మైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లు లేకపోవ‌డంతో పంట‌ను రోడ్డుపై గుట్టలుగా పడేసి వెళుతున్నారు.

Andhraptradesh: చిత్తూరు జిల్లాలో దారుణ ప‌రిస్థితులు.. రోడ్ల ప‌క్క‌న గుట్ట‌లు గుట్ట‌లుగా 'ఏ' గ్రేడ్ మామిడి పండ్లు
Mnago Crop Damage
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2021 | 8:38 AM

Share

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు విప‌రీత‌మైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లు లేకపోవ‌డంతో పంట‌ను రోడ్డుపై గుట్టలుగా పడేసి వెళుతున్నారు. దామలచెరువు మ్యాంగో మార్కెట్ లో మండి యజమానులు కొనుగోళ్లు జ‌ర‌ప‌క‌పోవ‌డంతో ట్రాక్టర్లలో మార్కెట్ కు తీసుకొచ్చిన మామిడి పంట‌ను మొగరాల రోడ్డులో పడేసి వెనుదిరుగుతున్నారు రైతులు. నిన్న మొన్నటి వరకు గిట్టుబాటు ధర లేకపోవ‌డంతో టమోటాలను చిత్తూరు జిల్లా రైతాంగం రోడ్లపై పడేసిన సంద‌ర్భాలు చూశాం. ఇప్పుడు మామిడికాయలను పారబోస్తున్న వైనం.. వారు ఏ ప‌రిస్థితుల్లో ఉన్నారో తెలియ‌జేస్తుంది. తిరుపతి దామలచెరువు రోడ్డులోని మొగరాల వద్ద రోడ్డు పక్కనే గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు ప‌డిఉన్నాయి.

క‌రోనా కల్లోలం నేప‌థ్యంలో మామిడి ఎగుమ‌తులు త‌గ్గాయి. దీంతో ఈ ఏడాది రేటు త‌క్కువ‌గానే ఉంది. అది చాల‌ద‌న్న‌ట్టు అకాల వ‌ర్షాలు రైతుల పొట్ట కొట్టాయి. దీంతో పంట భారీ స్థాయిలో డ్యామేజ్ అయ్యింది. ఉన్న కొద్ది పంట‌కైనా మంచి రేటు ద‌క్కి.. పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బు అయినా వెన‌క్కి వ‌స్తుందేమో అని భావిస్తే.. ఇప్పుడు పంటను రోడ్ల ప‌క్క‌నే ప‌డేయాల్సిన ప‌రిస్థితులు దాపురించాయి.

Also Read: వైద్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి తెలంగాణ స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్

Love: ప్రేమించిందని దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు

Follow Us
అందుకే శ్రీహరిని చివరి చూపు చూడలేకపోయాను..
అందుకే శ్రీహరిని చివరి చూపు చూడలేకపోయాను..
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం