Hyderabad News : హైదరాబాద్‌లో ఓ యువతిపై 22 ట్రాఫిక్ చలాన్లు..! అవాక్కయిన పోలీసులు..
Hyderabad News : హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే
Hyderabad News : హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తున్నారు. అయినా కానీ కొంతమంది పోకిరీలు యధేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలను బేకాతరు చేస్తున్నారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసే ఒకటి పోలీసులకు చిక్కింది. ఓ యువతికి వచ్చిన చలాన్లు తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఓ యువతి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు సైతం నివ్వెరపోయారు.
యువతి స్కూటీపై తిరుగుతూ ట్రాఫిక్ రూల్స్ ఏమాత్రం పాటించలేదు. దీంతో ఆమెకు నిబంధనలు పాటించకపోవడంతో ఏకంగా 22 సార్లు చలాన్లు పడ్డాయి. అందులో సెల్‌ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడంపై జరిమానాలు విధించారు. అయినా యువతి యధేచ్ఛగా తిరగడం చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ క్రమంలోయువతికి కూకట్‌పల్లి పోలీసులు తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చలాన్ల రుసుము రూ,9,070 కట్టించుకొని పంపించారు. మరోసారి ఇలా జరగకూడదని హెచ్చరించారు.
Wake up before anything goes wrong.
Follow traffic rules. Be safe.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/vEK50nrefb
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 15, 2021