AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna: బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం సైకో కిల్లర్ గా మారనున్న బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ..

ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

Raashi Khanna: బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం సైకో కిల్లర్ గా మారనున్న బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ..
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2021 | 10:58 AM

Share

Raashi Khanna:

ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా తర్వాత రాశిఖన్నాకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది రాశిఖన్నా. అయితే ఈ అమ్మడు ఇన్ని సినిమాలు చేసిన సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతుంది. ఒకవేళ సినిమా   విజయం సాధించినా ఆ క్రెడిట్ హీరో ఖాతాలోకే వెళ్తుంది. అయితే ఇప్పటివరకు రాశిఖన్నా చేసిన సినిమాల్లో జయలవకుశ మినహా మిగిలిన హీరోలందరూ మీడియం రేంజ్ హీరోలే.. స్టార్ హీరోల సరసన సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ అమ్మడుకు అవకాశాలు రావడంలేదు. దాంతో ముద్దుగుమ్మ స్పీడ్ పెంచింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తమిళ్ సినిమాలకు కూడా ఓకే చెప్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది. అంతేకాదు హిందీ వెబ్ సిరీస్ లను కూడా లైన్లో పెట్టేస్తోంది. దాంతో ఇప్పుడు రాశి ఖన్నా ఫుల్ బిజీ అయింది.

ఇప్పటికే రాశిఖన్నా   బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. అలాగే మరో వెబ్ సిరీస్ కు కూడా గ్రీన్ సిగ్నల్  ఇచ్చిందని టాక్. భారీ వెబ్ సిరీస్ లోను ఆమె డిఫరెంట్ రోల్ చేస్తోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సిరీస్ కి రాజేశ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అజయ్ దేవగణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సిరీస్ లో, రాశి ఖన్నా సైకో కిల్లర్ పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ వెబ్ సిరీస్, డిస్నీ హాట్ స్టార్ లో జులై 21 నుంచి స్ట్రీమింగ్  కానుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ప్రశాంత్ నీల్ దర్శకతం లో ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.!:Vijay Sethupathi in Jr NTR video.

కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.