Kadthal Birthday Party Case: కడ్తాల్ రేవ్ పార్టీ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..
Kadthal Rave Party Case: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ రేవ్ పార్టీ కేసులో పలు విస్తు పోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడ్తాల్‌లోని ఓ ఫాంహౌజ్‌లో మూడ్రోజుల
Kadthal Rave Party Case: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ రేవ్ పార్టీ కేసులో పలు విస్తు పోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడ్తాల్‌లోని ఓ ఫాంహౌజ్‌లో మూడ్రోజుల కిందట నిబంధనలకు విరుద్దంగా బర్త్ డే వేడుకలు నిర్వహిస్తుండటంతో.. సైబరాబాద్ పోలీసులు దాడి చేసి 68 మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. అది పుట్టిన రోజు వేడుక కాదని, ఈవెంట్ నిర్వాహకులు దావత్ వేడుకగా ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు. నిర్వాహకుల్లో ఒకరైన జీషన్ అలీఖాన్ అలియాస్ జాక్ ‘ఇన్‌స్టాగ్రాం’లో ప్రకటన ఇచ్చి ఈ ఆర్గనైజడ్ పార్టీకి ఆహ్వానించినట్లు దర్యాప్తులో వెల్లడైందనన్నారు.
గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులోనూ ఈ పేరు ప్రముఖంగా వినిపించింది. అతను.. ఇతను ఒక్కడేనా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే.. జీషాన్‌పై గతంలో పలు కేసులు ఉన్నాయి. ఆయన నేర చరితపై పోలీసులు కూపీ లాగుతున్నారు. రికార్డుల్లో 2016లో బహదూర్‌పురా ఠాణా పరిధిలో నకిలీ సర్టిఫికేట్ కేసు, 2018లో పంజాగుట్ట పీఎస్‌లో రేప్ కేసు నమోదైనట్లు గుర్తించారు. 2018లో నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు డగ్స్ సరఫరా చేస్తున్నందుకు అరెస్ట్ చేశారు. అయితే.. డ్రగ్స్ కేసులో ఉన్న జాక్.. జీషాన్ ఒకరేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. ఈ పార్టీలో పాల్గొన్న వారి వద్ద జీషాన్ రూ.5 వేల రూపాయల ఎంట్రీఫీజును వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. అయితే లాక్‌డౌన్‌కు ముందు పలు పబ్బుల్లో జరిగిన పార్టీలకు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లను లిస్ట్ ఔట్ చేసి ఈ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. అయితే.. ముందుగా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి.. పార్టీని నిర్వహించారని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ పార్టీలో డ్రగ్స్ సరఫరా కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని.. వీరిలో పట్టుబడిన వారి నేరచరిత్రను పరిశీలిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
Also Read: