Road Accident: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ, రెండేళ్ల కూతురు దుర్మరణం..
Father and Daughter Died: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో తండ్రీ.. రెండేళ్ల చిన్నారి ప్రాణాలు
Father and Daughter Died: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో తండ్రీ.. రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన జిల్లలోని చింతపల్లి మండలంలోని కుర్మెడ్ గేట్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రివేళ కారు, జేసీబీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులను మండలంలోని హోమంతాలపల్లికి చెందిన తండ్రీ కూతుర్లు.. వలమల రమేష్ (30), అక్షర (2) గా గుర్తించినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహాలను పోస్తుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలో జరిగిన శుభకార్యానికి వెళ్లి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో తండ్రి, కూతురు మరణించడంతో… హోమంతాలపల్లిలో విషాదం నెలకొంది.
Also Read: