Telangana Crime News: బర్త్‌డే పేరుతో రేవ్‌ పార్టీ.. మద్యం మత్తులో యువ‌తీ యువ‌కుల హంగామా.!

హైదరాబాద్‌ శివారుల్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి...

Telangana Crime News: బర్త్‌డే పేరుతో రేవ్‌ పార్టీ.. మద్యం మత్తులో యువ‌తీ యువ‌కుల హంగామా.!
Rave Party

హైదరాబాద్‌ శివారుల్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. మద్యం తాగి చిందులు వేస్తున్న యువతీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని ఓ ఫామ్ హౌస్‎లో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. హైదరాబాద్‌ నగరానికి శివారు ప్రాంతంలో ఉన్న భరత్‌ పాం హౌస్‌లో సాయంత్రం సమయంలో సుమారు 70 మంది యువతి, యువకులు చేరుకున్నారు. బర్త్‌ డే పార్టీ పేరుతో విచ్చలవిడిగా నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. హైదరాబాద్‌కు చెందిన వరుణ్‌… భరత్‌ ఫాం హౌస్‌లో బర్త్‌ డే పార్టీ నిర్వహించాడు. ఆర్గనైజర్లుగా జాశన్‌ఖాన్‌, అన్వేష్‌ అన్నీ తామై చూసుకున్నారు. మందు, విందు, డ్యాన్స్‌తో తెగ ఎంజాయ్‌ చేశారు.

తాగిన మైకంలో వాళ్లు చేసిన హంగామాకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకుని, వాళ్లకు స‌డ‌న్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా పోలీసులను చూసిన ఆ యువతి, యువకులకు దిమ్మతిరిగిపోయింది. రేవ్‌ పార్టీకి అనుమతించిన భరత్‌ ఫాంహౌస్‌ యాజమానితో పాటు ఆర్గనైజర్లు, అలాగే పార్టీ వచ్చిన యువతి, యువకులను కూడా అరెస్ట్‌ చేశారు. ఇక అసలే కరోనా… ఆపై కర్ఫ్యూ అమల్లో ఉన్నా…ఇవేం పట్టనట్లు పార్టీ నిర్వహించడంపై ఖాకీలు కన్నెర్ర జేశారు.

Also Read: భ‌ర్తతో గొడ‌వ‌పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య‌.. ఆమె పెట్టె చెక్ చేసి అత‌డు కంగుతిన్నాడు

యువతి ఆత్మహత్య.. రేపిస్టుని పట్టించిన వీర్యకణాలు

Click on your DTH Provider to Add TV9 Telugu