China: చైనాలో గ్యాస్ పేలుడు….12 మంది మృతి…..100 మందికి పైగా గాయాలు

సెంట్రల్ చైనాలో ఆదివారం ఉదయం జరిగిన గ్యాస్ పేలుడులో 12 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. హుబె ప్రావిన్స్ లోని జాంగ్వాన్ జిల్లా షియాన్ సిటీలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

China: చైనాలో గ్యాస్ పేలుడు....12 మంది మృతి.....100 మందికి పైగా గాయాలు
China Gas Explosion
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 13, 2021 | 2:55 PM

సెంట్రల్ చైనాలో ఆదివారం ఉదయం జరిగిన గ్యాస్ పేలుడులో 12 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. హుబె ప్రావిన్స్ లోని జాంగ్వాన్ జిల్లా షియాన్ సిటీలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జనావాసాల మధ్య పేలుడు జరగడంతో ఇంకా ఎక్కువమంది మరణించి ఉండవచ్చునని భావిస్తున్నారు., సుమారు 150 మందిని సహాయక బృందాలు రక్షించాయి. అనేక ఇళ్ళు ఈ ఘటనలో దెబ్బ తిన్నాయి. తీవ్రంగా గాయపడిన 39 మందిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఆరెంజ్ సూట్లలో ఉన్న సహాయక బృందాలు రక్షణ చర్యల్లో నిమగ్నమైన దృశ్యాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సిటీలోని యాన్ హూ మార్కెట్లో పేలుడు సంభవించిందని హాంకాంగ్ లోని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది. ఉదయం వేళ కావడంతో ప్రజలు బ్రేక్ ఫాస్ట్ కోసమో.. కూరగాయలు కొనేందుకో ఈ మార్కెట్ కి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్టు ఈ పత్రిక పేర్కొంది. పేలుడుకు కారణాలు తెలియలేదు. 2013 లో క్వింగ్ డాలో జరిగిన ఇదే తరహా ఘటనలో నాడు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పేలిపోగా 55 మంది మృతి చెందారు. కాగా- షియాన్ సిటీలోని ఆసుపత్రుల్లో 147 మందిని చేర్చినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తాజాగా వెల్లడించింది. 2015 లో తియాంజిన్ సిటీలో జరిగిన కెమికల్ వేర్ హౌస్ పేలుడు ఘటనను ఈ పత్రిక గుర్తు చేస్తూ.. నాడు 173 మంది మరణించారని పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్

పిల్లలకు థర్డ్ కోవిద్ వేవ్ వల్ల పెద్దగా ముప్పు లేకపోవచ్చు……లాన్సెట్ నిపుణుల నివేదిక

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..