రూలంటే రూలే ! మాస్క్ లేని బ్రెజిల్ అధ్యక్షునికి 100 డాలర్ల జరిమానా ! చెల్లిస్తాడో …? చెల్లదంటాడో ..?

బ్రెజిల్ లోని సావో పాలోలో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీకి అధ్యక్షుడు జైర్ బొల్సనారో అత్యుత్సాహంగా హాజరయ్యారు. కానీ ఈ కోవిద్ సీజన్ లో ఫేస్ మాస్క్ జోలికి పోకుండా కేవలం ఓపెన్ హెల్మెట్ ధరించి ఆయన ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

రూలంటే  రూలే !  మాస్క్ లేని బ్రెజిల్ అధ్యక్షునికి 100 డాలర్ల జరిమానా ! చెల్లిస్తాడో ...? చెల్లదంటాడో ..?
100 Dollars For Maskless Mo
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 13, 2021 | 3:01 PM

బ్రెజిల్ లోని సావో పాలోలో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీకి అధ్యక్షుడు జైర్ బొల్సనారో అత్యుత్సాహంగా హాజరయ్యారు. కానీ ఈ కోవిద్ సీజన్ లో ఫేస్ మాస్క్ జోలికి పోకుండా కేవలం ఓపెన్ హెల్మెట్ ధరించి ఆయన ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక వడ్డించేవాడు మనోడైతే ఇంకేం అన్నట్టు ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన యువతలో ఒక్కరైనా మాస్క్ ధరిస్తే ఒట్టు !వీళ్ళను జైర్ భలే ఎంకరేజ్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ఈయన మళ్ళీ పోటీ చేయబోతున్నాడు. అందుకే ఇప్పటినుంచే యువతను తనవైపు తిప్పుకోవాలన్న ఆరాటంలో ఉన్నారీయన. కానీ సావో పాలో గవర్నర్ జో డోరియాతోనే ఈయనకు చిక్కొచ్చి పడింది. కోవిద్ తరుణంలో ప్రతివారూ మాస్క్ ధరించాల్సిందేనని, లేని పక్షంలో జరిమానాలు విధిస్తామని డోరియా కఠిన నిబంధన విధించారు. కానీ ఆయన ఆదేశాలను జైర్ పట్టించుకోలేదు. కోవిద్ ప్రోటోకాల్ ని అతిక్రమించిన ఈయనకు డోరియా అధికారవర్గం 100 డాలర్ల జరిమానా విధించింది. అయితే ఆయన ఈ ఫైన్ చెల్లిస్తాడా లేదా అన్నది తెలియడం లేదు. దేశంలో 4 లక్షల 85 వేలమందికి పైగా కోవిద్ రోగులు మరణించినా..తాను మాత్రం ‘ఇంట్లోనే ఉండండి..ఫేస్ మాస్క్ ధరించండి’.లాంటి రూల్స్ ని పాటించేది లేదని అంటున్నారు బోల్సనారో !ఈ మాస్కులు ఎందుకని ….వీటి బదులు క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మెడిసిన్స్ వాడితే చాలునని ఈయన ఉద్బోధిస్తున్నారు.

ఈ మందులు కోవిద్-19 చికిత్సలో అంతబాగా పని చేయవని నిఫుణులు చెబుతున్నా ఆయన మాత్రం నమ్మడం లేదు. పైగా వ్యాక్సిన్ తీసుకున్నవారు అసలు మాస్కులే ధరించాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. అమెరికా తరువాత బ్రెజిల్ కోవిద్ మరణాలకు పెట్టింది పేరని ఆ మధ్య పతాక శీర్షికలతో వార్తలు వచ్చాయి కూడా.

మరిన్ని ఇక్కడ చూడండి: China: చైనాలో గ్యాస్ పేలుడు….12 మంది మృతి…..100 మందికి పైగా గాయాలు

CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్