Telangana: కాంగ్రెస్‎ ఆప‌రేష‌న్ ఆకర్ష్‎లో ఆ మంత్రి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌..

ఇప్పుడు తెలంగాణలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప్ర‌కంప‌ణ‌ల్లో ఆయ‌నే కీల‌కం. ఎక్క‌డ ఎవ‌రు కండువా క‌ప్పుకున్నా ఆ మంత్రి లేకుండా మంత్రాంగం ముందుకు జ‌ర‌గ‌డం లేదన్న చర్చ జోరుగా నడుస్తోంది. ప్ర‌తి ఆక‌ర్ష్‎లో ఆయ‌న అప‌రేష‌న్ ఉండాల్సిందే అంటున్నారు కొందరు. జిల్లాతో సంబంధం లేకుండా ఎవ‌రి జాయినింగ్ అయినా ఆయ‌నే దగ్గ‌రుండి అప‌రేష‌న్ కంప్లీట్ చేస్తున్నారట.

Telangana: కాంగ్రెస్‎ ఆప‌రేష‌న్ ఆకర్ష్‎లో ఆ మంత్రి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌..
Congress Party
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 25, 2024 | 5:33 PM

ఇప్పుడు తెలంగాణలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప్ర‌కంప‌ణ‌ల్లో ఆయ‌నే కీల‌కం. ఎక్క‌డ ఎవ‌రు కండువా క‌ప్పుకున్నా ఆ మంత్రి లేకుండా మంత్రాంగం ముందుకు జ‌ర‌గ‌డం లేదన్న చర్చ జోరుగా నడుస్తోంది. ప్ర‌తి ఆక‌ర్ష్‎లో ఆయ‌న అప‌రేష‌న్ ఉండాల్సిందే అంటున్నారు కొందరు. జిల్లాతో సంబంధం లేకుండా ఎవ‌రి జాయినింగ్ అయినా ఆయ‌నే దగ్గ‌రుండి అప‌రేష‌న్ కంప్లీట్ చేస్తున్నారట. ఇంత‌కీ ఏవ‌రా లీడ‌ర్.. ఏంటా క‌థ.? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆ మంత్రి కీల‌కంగా మారారు. ఎక్క‌డ ఏ జాయినింగ్ జ‌రిగిన ఆ మంత్రి క‌నుస‌న్న‌ల్లోనే అది పూర్తి అవుతుంది. జాయిన్ చేసుకునేది సీఎం అయినా దాని వెనుక ఉండేది మాత్రం ఖ‌మ్మం జిల్లా మంత్రి పోంగులేటి అనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. అవును ఈ ప్ర‌చారానికి రోజు రోజుకు బ‌లం చేకూరుతూనే ఉంది. ఎందుకంటే ఆ మంత్రి ఇంప్లూయిన్స్ ఆ రేంజ్‎లో ఉంది. ఆయ‌న లేకుండా ఒక్క జాయినింగ్ కూడా జ‌ర‌గ‌డం లేదంటే మంత్రి ఏంత ప‌వ‌ర్ పుల్ అనేది ఆర్థం చేసుకోవ‌చ్చు.

ఆప‌రేష‌న్‎లో పోంగులేటి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌..

ఇక ఈ మ‌ధ్య తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ అప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రారంభించింది. దీని కోసం జాగ్ర‌త్త‌గా ఎమ్మెల్యేల‌ను బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్‎లోకి లాగుతున్నారు. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా రంగంలోకిదిగి కండువాలు కూడా కప్పేస్తున్నారు. కానీ ఈ చేరిక‌ల వెనుక అప‌రేష‌న్ చేస్తున్న‌ది మాత్రం మంత్రి పోంగులేటి అనే టాక్ ఇప్పుడు పార్టీలో, ప్ర‌భుత్వంలో జోరుగా న‌డుస్తుంది. దీనికి బ‌లం చేకూరుస్తూనే తాజాగా మాజీ స్పీక‌ర్ పోచారం జాయినింగ్‎లో కూడా పోంగులేటి కీల‌క పాత్ర పోషించిన‌ట్లు తెలుస్తోంది. సిఎంతో పాటుగా పోచారం ఇంటికి వెళ్లిన పోంగులేటి.. కండువా క‌ప్పి జాయిన్ చేసుకునే వ‌ర‌కు ఎవరికీ అనుమానం రాలేదు. ఆయన చేరికతో బిఆర్ఎస్ షాక్‎కు గురైంది. ఆ షాక్‎లో నుండి తేరుకోక ముందే ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‎ను రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో పోంగులేటి సీఎం ఇంటికి తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా క‌ప్పించారు.

బిఆర్ఎస్‎కు అత్యంత విధేయుడు అయిన సంజ‌య్ అప‌రేష‌న్‎ను అస‌లు పార్టీలో ఎవ‌రికీ డౌట్ రాకుండా ఫినిష్ చేసారు పోంగులేటి. ఇక ఈ రెండు సంఘ‌ట‌న‌లు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‎లో హ‌ట్ టాఫిక్‎గా మారాయి. పోంగులేటి సంజ‌య్ వ్య‌వ‌హ‌రంలో జీవ‌న్ రెడ్డి హ‌ర్ట్ అయినా కూడ లైట్ తీసుకోని మ‌రి సంజ‌య్‎ని త‌న చాంబ‌ర్‎లోకి పిలిపించుకోని స‌పోర్ట్ చేశారట మంత్రి పోంగులేటి. ఇక ఇప్ప‌టికే బిఆర్ఎస్ నుండి జాయిన్ అవ్వాలి అనుకున్న ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా వ‌యా పోంగులేటి నుండి పోవ‌డమే బెట‌ర్ అని ఫీల్ అవుతున్నార‌ట. జిల్లాలో ఎవ‌రు ఫీల్ అయినా యూ డోంట్ కేర్ ఐ విల్ దేర్ అంటున్నార‌ట మంత్రి పోంగులేటి. దీంతో అధికార పార్టీ తీర్థం పుచ్చుకుందాం అనుకుంటున్న ఎమ్మెల్యేల‌కు ఆశాదీపం అవుతున్నార‌ట ఆయన.

పొంగులేటిపై సీనియర్ల అలక..

ఇక ఇప్పుడు జాయినింగ్ ఏదైనా వ‌యా పోంగులేటి అయితేనే బెటర్ అనుకుంటున్నార‌ట పక్కపార్టీ ఎమ్మెల్యేలు. ఇదిలా ఉంటే జిల్లాల‌లో పొంగులేటిపై కోపంగా ఉన్నార‌ట సీనియ‌ర్ మంత్రులు, నేత‌లు. త‌మ‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండా.. చ‌ర్చించ‌కుండా ఎలా జాయిన్ చేసుకుంటారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..