Telangana: విద్యార్థులకు అలెర్ట్.. బుధవారం స్కూల్స్ బంద్…

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అటు ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జూన్‌ 26న బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని..పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

Telangana: విద్యార్థులకు అలెర్ట్.. బుధవారం స్కూల్స్ బంద్...
Telangana School
Follow us

|

Updated on: Jun 25, 2024 | 10:18 PM

జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ రీ ఓపెన్ అయిన విషయం తెలిసిందే.  గవర్నమెంట్ స్కూల్స్‌లో మొదటిరోజే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేశారు.  ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మార్చకుండానే ముంద్రించడంతో…  పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకున్నారు. ముందు మాట మార్చి మళ్లీ తిరిగి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అయితే జూన్ 26న పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ABVP పాఠశాలలకు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది. పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న పిలుపునిచ్చి పాఠశాలల బంద్‌కు అందరూ సహకరించాలని కోరింది. డీఈఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా… పాఠశాల విద్య పర్యవేక్షణ ఎలా సాధ్యమో చెప్పాలని.. ABVP డిమాండ్ చేస్తోంది.

నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠాశాలల యాజామాన్యాలు బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నాయని.. ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ABVP కోరుతోంది. పర్మిషన్స్ లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని సూచించింది.  ఈ నెల 26న జరిగే స్కూళ్ల బంద్​కు మేనేజ్ మెంట్లు సహకరించాలని…  స్వచ్చందంగా పాఠశాలలు బంద్ చేయాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
మ్యాగజైన్ పై మృణాల్ మెరుపులు.. అదరహో అనిపించిన అమ్మడి అందం
మ్యాగజైన్ పై మృణాల్ మెరుపులు.. అదరహో అనిపించిన అమ్మడి అందం
నోట్లో నాలుకను చూసి ఒంట్లో క్యాన్సర్‌ ఉందో లేదో ఇట్టే చెప్పొచ్చు
నోట్లో నాలుకను చూసి ఒంట్లో క్యాన్సర్‌ ఉందో లేదో ఇట్టే చెప్పొచ్చు
రూ. 12 వేల ఫోన్‌ రూ. 7500కే.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో
రూ. 12 వేల ఫోన్‌ రూ. 7500కే.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో
తస్మాత్ జాగ్రత్త.. మల్టీవిటమిన్లు అతిగా వాడితే అంతే సంగతులు..
తస్మాత్ జాగ్రత్త.. మల్టీవిటమిన్లు అతిగా వాడితే అంతే సంగతులు..
: రక్తపోటు అదుపులో ఉండాలంటే మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి
: రక్తపోటు అదుపులో ఉండాలంటే మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి