Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu(December 16, 2025): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఉద్యోగంలో సొంత లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, తోటి ఉద్యోగులకు సహాయపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (డిసెంబర్ 16, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు బిజీగా సాగి పోతాయి. వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాన్నిస్తుంది. పిల్లల నుంచి అనుకోని శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇతర ఉద్యోగాలకు వెళ్లాలన్న మీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో సొంత లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, తోటి ఉద్యోగులకు సహాయపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి ఇది సమ యం కాదు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా సానుకూలంగా పురోగమిస్తాయి. ఆర్థిక, రుణ సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహ కారం లభిస్తుంది. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన బాధ్యతలు, లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో పలు కుబడి పెరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను సంతృప్తి కరంగా నిర్వర్తిస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది. తోబుట్టువులతో చాలా కాలంగా కొనసాగుతున్న ఆస్తి, ఆర్థిక వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారం విషయంలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వవద్దు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొద్దిపాటి ఇబ్బందులున్నప్పటికీ సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. పని భారం కాస్తంత ఎక్కువగానే ఉన్న ప్పటికీ బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు అత్యధికంగా ఆర్థిక లాభం పొందుతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు మిత్రుల సహకారంతో ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కొనసాగిస్తారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ద పెట్టడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2): వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యంగా వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ది చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగులు అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది.వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒత్తిడి, శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ ఎటువంటి వాగ్దా నాలూ చేయకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా నిలకడగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు కానీ, కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు అనుకూలమైన వాతావరణం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.



