- Telugu News Photo Gallery Spiritual photos Sun Jupiter Aspect: Adhikara Yoga and Wealth for these zodiac signs Telugu Astrology
సంక్రాంతి వరకూ ఆ రాశులకు పండుగే పండుగ..! వారికి పట్టిందల్లా బంగారం
ఈ నెల(డిసెంబర్) 15 నుంచి జనవరి 14 వరకు ధనూ రాశిలో సంచారం చేస్తున్న రవికి, మిథున రాశిలో ఉన్న గురువుతో సమసప్తక దృష్టి ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు పరస్పరం చూసుకోవడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడంతో పాటు, రాజకీయంగా, ప్రభుత్వపరంగా ప్రాబల్యం కలిగే అవకాశం కూడా ఉంది. గ్రహ రాజైన రవి, దేవతల గురువైన బృహస్పతి పరస్పరం చూసుకోవడం వల్ల ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులవారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టడం జరుగుతుంది.
Updated on: Dec 16, 2025 | 3:31 PM

మేషం: ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలైన రవి, గురువులు పరస్పరం చూసుకోవడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఒక సంస్థకు ఉన్నతాధికారి అయ్యే అవ కాశం కూడా ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది.

సింహం: పంచమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి రవి మీద లాభ స్థానం నుంచి గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు, ప్రభుత్వాధికారు లకు ప్రాబల్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. రాజకీయాల్లో ప్రవేశించినవారికి తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వ ఉన్నతాధికార ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

తుల: తృతీయ స్థానంలో ఉన్న లాభాధిపతి రవిని భాగ్యస్థానం నుంచి గురువు చూడడం వల్ల అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము తప్పకుండా చేతికి అందుతుంది.

వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న దశమాధిపతి రవిని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి.

ధనుస్సు: ఈ రాశిలో ఉన్న భాగ్యాధిపతి రవిని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో రాజ యోగాలు కలుగుతాయి. పదోన్నతులతో పాటు, డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. వారసత్వ సంపద లభిస్తుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.

కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రవికి పంచమ స్థానంలో ఉన్న గురువుకు పరస్పర వీక్షణ ఏర్పడి నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగానికి అవకాశముంది.



