- Telugu News Photo Gallery Spiritual photos Astrology 2026: Top 5 Lucky Zodiac Signs for Financial Gains and Lottery Wins
Astrology 2026: కొత్త ఏడాదిలో వారికి లాటరీలా అదృష్టం పట్టడం ఖాయం..!
కొత్త ఏడాది శుభ గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి లాటరీ యోగం పట్టే అవకాశం ఉంది. జ్యోతిషశాస్త్రం లంకె బిందెల యోగంగా అభివర్ణించే లాటరీ యోగం అయిదు రాశులవారికి కలగడానికి బాగా అవకాశం ఉంది. లాటరీలు, షేర్లు, స్పెక్యులేషన్లు ఈ రాశులకు అత్యధికంగా లాభించి సంపన్నులను చేస్తాయి. ఈ రాశులుః మేషం, వృషభం, కర్కాటకం, సింహం, ధనూ రాశులు. ఈ రాశులవారికి సాధారణ ఆర్థిక స్థితి నుంచి తప్పకుండా విముక్తి లభించి సంపన్న యోగం పడుతుంది. కొద్ది ప్రయత్నంతో వీరి దశ తప్పకుండా తిరుగుతుంది.
Updated on: Dec 16, 2025 | 3:49 PM

మేషం: ధన యోగాలను ఎక్కువగా ఇచ్చే గురు, శుక్రులు బాగా అనుకూలంగా సంచారం చేయడం వల్ల ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. భారీగా పెట్టుబడులు పెట్టే ముందు ఈ రాశివారు తప్పకుండా లాటరీ టికెట్లు కొని అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్లలో కూడా కొద్దిగా మదుపు చేయడం వల్ల ఊహించని ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు, ఓర్పు, సహనాలతో ఉండడంతో పాటు సానుకూల దృక్పథంతో కూడా వ్యవహరించడం మంచిది.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు ధన, భాగ్య, లాభాధిపతులు కూడా అనుకూలంగా మారుతున్నందు వల్ల ఈ రాశివారు 2026 ప్రారంభంలోనే ఆదాయ వృద్ధికి ప్రణాళికలు తయారు చేసుకోవడం మంచిది. అనేక విధాలుగా అదృష్టం వీరి తలుపు తట్టబోతోంది. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకోవడం మంచిది. ఈ రాశివారికి లాటరీ భాగ్యం కలగడంతో పాటు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు అపారంగా లాభిస్తాయి.

కర్కాటకం: ఈ రాశిలో ధన కారకుడు గురువు ఉచ్ఛపట్టబోతున్నందువల్ల ఈ రాశివారికి లాటరీని మించిన భాగ్యం కలిగే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. స్వల్ప పెట్టుబడులు కూడా అత్యధిక లాభాలని స్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. తరచూ లాటరీ టికెట్లు కొనడం వల్ల తప్పకుండా ఆశించిన ఫలితం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగానూ, అప్రయత్నంగానూ ఆదాయం వృద్ది చెందుతుంది.

సింహం: ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ రాశివారికి అనేక అవకాశాలు, మార్గాలు లభించడం జరుగుతుంది. శుభ గ్రహాల అనుకూలత వల్ల వీరికి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ రాశివారు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి లాటరీ టికెట్లు కొనడం, షేర్లలో పెట్టుబడులు పెట్టడం వంటివి ప్రారంభించడం మంచిది. వచ్చే ఏడాది వీరి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కూడా బాగా కలిసి వస్తాయి.

ధనుస్సు: వచ్చే ఏడాదంతా రాశ్యధిపతి, ధన కారకుడు అయిన గురువు ఈ రాశివారికి బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి, ధన యోగాలకు, ధన ధాన్య సమృద్ది యోగానికి కూడా బాగా అవకాశం ఉన్నందువల్ల ఈ రాశివారు తప్పనిసరిగా లాటరీ టికెట్లను కొని అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఆర్థికాభివృద్ధితో పాటు అనేక విధాలుగా అదృష్టం తలుపు తట్టే అవకాశం కూడా ఉంది.



