Harish Rao: కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు సెటైర్లు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇప్పుడు "వన్ ఛాన్స్ ప్లీజ్" అంటున్న కాంగ్రెస్ పార్టీ.. గెలిచిన తర్వాత "ఎక్స్‌క్యూజ్‌మీ ప్లీజ్" అంటుందని మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి కర్ణాటక ప్రజలు మోసపోయారన్నారు. రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీగా మారి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వంద అబద్దాలు ఆడి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తోందని స్పందించారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇప్పుడు “వన్ ఛాన్స్ ప్లీజ్” అంటున్న కాంగ్రెస్ పార్టీ.. గెలిచిన తర్వాత “ఎక్స్‌క్యూజ్‌మీ ప్లీజ్” అంటుందని మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హామీలను నమ్మి కర్ణాటక ప్రజలు మోసపోయారన్నారు. రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీగా మారి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వంద అబద్దాలు ఆడి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తోందని స్పందించారు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కర్ఫ్యూ వస్తుంది అని ఏద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ అంటేనే నాటకం. కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు అని ప్రజల్ని మోసం చేశారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టా ఇచ్చి, ఓనర్లు చేస్తం అన్నది కేసీఆర్. ఇంటింటికీ సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ప్రతి ఇంటికి అర్థం అయ్యేలా చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గాలి వీస్తోంది. అబద్ధాలకు వ్యాప్తి ఎక్కువ కాబట్టి నిజం నిలకడ మీద తెలుస్తది అని హరీష్ రావు ప్రజలకు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..