CM KCR: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. అలర్టయిన పోలీసులు.. ఒకరు అరెస్ట్..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీ (బీఆర్ఎస్) దళపతి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పీడు పెంచారు. వరుసగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. సామెతలతో సెటైర్లు.. ప్రత్యర్థులపై మాటల తూటాలు.. కాస్త సెంటిమెంట్‌ను జోడిస్తూనే జాతీయ పార్టీల తీరును గులాబీ బాస్‌ సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారు.

CM KCR: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. అలర్టయిన పోలీసులు.. ఒకరు అరెస్ట్..
CM KCR
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 16, 2023 | 10:37 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీ (బీఆర్ఎస్) దళపతి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పీడు పెంచారు. వరుసగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. సామెతలతో సెటైర్లు.. ప్రత్యర్థులపై మాటల తూటాలు.. కాస్త సెంటిమెంట్‌ను జోడిస్తూనే జాతీయ పార్టీల తీరును గులాబీ బాస్‌ సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌ సభల్లో పాల్గొని మాట్లాడారు. ప్రతీ సభలోనూ బీఆర్‌ఎస్ హాయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అలాగే తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు.

కేంద్రానికి వంద ఉత్తరాలు రాసినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు కేసీఆర్‌. అలాంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు కేసీఆర్‌. కాంగ్రెస్ చేసిన తప్పిదాలతో 58ఏళ్లు అరిగోసపడ్డామన్నారు కేసీఆర్‌. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ధోఖా చేసిందని.. అలాంటి పార్టీని మళ్లీ నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు.

పెట్టుబడి సాయంగా రైతు బంధు.. 24 గంటల పాటు ఉచిత కరెంట్‌.. సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించిన కేసీఆర్‌.. లేటెస్ట్‌గా జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణం ఖాయమన్నారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా ఇప్పటినుంచే ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపించింది. మొత్తానికి గులాబీ బాస్ స్పీచ్‌.. టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది.

కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం..

ఇదిలాఉంటే.. మెదక్ జిల్లా, నర్సాపూర్ సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. సభ ప్రగణంలోకి వచ్చిన అస్లాం అనే వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ చెందిన అస్లాం అనే యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. బుల్లెట్ స్వాధీనం విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని దృవీకరించారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా.. కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం రేపడంతో పోలీసులు భద్రతను పెంచారు. పకడ్భంధీగా బందోబస్తును నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..