AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఎం రేవంత్ పాలనలో మల్లారెడ్డి మౌనం వెనుక అసలు మర్మమేంటి..

నాడు కుర్సీ మడతెట్టినట్టు కాలేజీ గోడ కూలగొడితే.. ట్రిపుల్‌ ఎక్స్‌ తరహా సంప్రదాయ మౌనమేలా. మార్పు మార్క్‌తో తెలంగాణ పొలిటికల్‌ సైన్స్‌లో సరికొత్త అధ్యాయంగా భౌతిక కూల్చివేత శాస్త్రం ప్రవేశపెట్టపడిందా? ఎన్నికలప్రచారపర్వంలో అలా సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్‌ ఇచ్చాయి. మార్పు మొదలైంది. భూ ఆక్రమణల ఫిర్యాదు నేపథ్యంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి కాలేజీ భవంతులను అధికారులు కూల్చేశారు.

Telangana: సీఎం రేవంత్ పాలనలో మల్లారెడ్డి మౌనం వెనుక అసలు మర్మమేంటి..
Malla Reddy
Srikar T
|

Updated on: Mar 09, 2024 | 9:55 PM

Share

నాడు కుర్సీ మడతెట్టినట్టు కాలేజీ గోడ కూలగొడితే.. ట్రిపుల్‌ ఎక్స్‌ తరహా సంప్రదాయ మౌనమేలా. మార్పు మార్క్‌తో తెలంగాణ పొలిటికల్‌ సైన్స్‌లో సరికొత్త అధ్యాయంగా భౌతిక కూల్చివేత శాస్త్రం ప్రవేశపెట్టపడిందా? ఎన్నికలప్రచారపర్వంలో అలా సవాళ్లు ప్రతి సవాళ్లు రీసౌండ్‌ ఇచ్చాయి. మార్పు మొదలైంది. భూ ఆక్రమణల ఫిర్యాదు నేపథ్యంలో మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి కాలేజీ భవంతులను అధికారులు కూల్చేశారు. అంతే.. ఎంతో హాట్‌ హాట్‌గా పంచ్‌ డైలాగులతో విమర్శలు ఎక్కుపెట్టే మల్లారెడ్డి ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లారు. అలా తన మార్క్‌ చాటుకున్నారు సరే. కాలేజీలు.. వ్యాపారాలు.. కోట్ల ఆస్తులన్నా సరే మినిష్టర్‌గా బుగ్గ కారులో షికారు చేయడమంటే మల్లన్నకు మహాక్రేజ్‌ అంటారు ఆయన ఫ్యాన్స్‌. బుగ్గ సంగతేమో కానీ మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తారనే టాక్‌ వచ్చింది. కలిస్తే తప్పేంటని.. త్వరలో తాను కలుస్తానని.. ఇద్దరం టీడీపీ కొమ్మలేమని సాంప్రదాయ మార్క్‌తో చిట్‌చాట్‌లో తన మన్‌ కీ బాత్‌ చెప్పకనే చెప్పారు మల్లారెడ్డి.

ఒకవేళ మల్లారెడ్డి కలవాలని భావించినా.. వేం నరేందర్‌ రెడ్డి అందుకు సహకరించినా.. సీఎం రేవంత్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ దొరకలేదా? కాంగ్రెస్‌లోకి చేరాలనుకున్న మల్లన్నకు మైనంపల్లి వర్గం బ్రేక్‌ వేసిందా? సీఎం రేవంత్‌ రెడ్డి పంతం నో ఎంట్రీ బోర్డ్‌ పెట్టేశారా? మల్లన్న-రేవంత్‌ మధ్య అలనాటి తగువులు మళ్లీ రగులుకుంటున్నాయా? మల్లన్న.. రేవంత్‌ రెడ్డి ఇద్దరూ టీడీపీలో వున్నారు. అప్పట్లోనే ఇద్దరి మధ్య అంతగా సయోధ్య లేదు. మల్కాజ్‌గిరి టికెట్‌ కోసం ఇద్దరి మధ్య పోటీ నడిచింది. క్యాష్‌ పార్టీ కోటాలో మల్లన్న మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ను చేజిక్కించుకున్నారనే అప్పట్లో టాక్‌. అలా మొదలైన దూరం.. అంతకంతకు పెరిగింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువలు ఉండరంటారు. కానీ ఈ ఇద్దరి విషయంలో ఆ లెక్క మ్యాచ్‌ అవ్వలేదు. బీఆర్‌ఎస్‌లో చేరి మల్లారెడ్డి మంత్రి అయ్యారు. రేవంత్‌ కాంగ్రెస్లో చేరి పీసీసీ చీఫ్‌ అయ్యారు. ఇద్దరి మధ్య వైరం మరింత ముదిరింది. మల్కాజ్‌గిరి అడ్డాగా ఉప్పు – నిప్పులా ఇద్దరి మధ్య డైలాగ్‌ వార్‌ ఆరని అగ్గిలా ఎప్పుడూ భగ్గుమనేది.

తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని బల్లగుద్ది చెప్పిన మల్లారెడ్డి.. సడెన్‌ యూటర్న్‌ తీసుకోవడం వెనుక మర్మమేంటి? సీఎం రేవంత్‌ రెడ్డి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డితో భేటీ వెనుక లోగుట్టు ఏంటీ? సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించడమే కాదు.. రేపోమాపో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని తాను కూడా కలుస్తానని ఎంతో మురిపెంగా చెప్పారు మల్లారెడ్డి. కానీ ఆ ముచ్చట తెరపైకి రాలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడేందుకు సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదా? అట్నుంచి పిలుపు రాలేదా? అంతకన్నా ముందే అల్లుడి కాలేజీని టచ్‌ చేసిన కూల్చివేత సీన్‌.. కథను మార్చేసిందా? భూ ఆక్రమణల కేసులు, కూల్చివేత ఘట్టం తమ కాలేజీల గేట్లను టచ్‌ చేస్తాయనే మల్లారెడ్డి డిఫెన్స్‌లో పడ్డారా? పవర్‌లో వున్నప్పుడు మైక్‌ ఎత్తి తొడగొట్టే సీన్‌ సంగతేమో కానీ.. పవర్‌ మారాక కుర్చీ మడతెట్టినట్టు కాలేజీ కూలగొట్టుడు ఘట్టం మల్లారెడ్డిని కలవర పెట్టిందా? ఇటు కాంగ్రెస్‌లో చేరే దారి లేక.. అటు బీఆర్‌ఎస్‌తో తప్ప మరో దరి లేక.. ఎందుకొచ్చిన లొల్లి అని మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ కోసం పట్టిన పట్టును తీసి గట్టున పెట్టారా? తగ్గేదెలా.. దేనికైనా రెడీ అనేలా వుండే మల్లన్న.. ఇల గమ్మున్నాడంటే.. కారణం ఏదో గట్టిదే అయివుంటుందనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఐటీ దాడులను ఎంతో ఈజీగా లైట్‌గా తీసుకున్న మల్లన్న.. కాలేజీ భవనాల కూల్చివేత విషయంలో కలవరపడ్డారంటే.. మౌనం వెనుక గట్టి మర్మమే ఉందా? పవర్‌లో ఉంటే ఖద్దర్‌‎కు ఓ లెక్కుంటది. పవర్‌ మారితే కథ మరోలా ఉంటది. టైమ్‌ అండ్‌ గేమ్‌.. చాలా డేంజర్‌ గురూ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!
ఏంటీ ఎప్పుడూ జుట్టు అతిగా రాలిపోతుందా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే!