TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం PRC ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌
TSRTC
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 09, 2024 | 7:32 PM

ఆర్టీసీ ఉద్యోగుల‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమ‌లు చేస్తున్నట్లు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ చెప్పారు. తాజాగా సవరించిన వేతనాన్ని జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. కొత్త ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీపై నెల‌కు 35 కోట్ల భారం ప‌డ‌నుంద‌ని వివరించారు. కొత్త ఫిట్‌మెంట్ ద్వారా 53వేల 71 మంది ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఆర్థిక ప్రయోజ‌నం కలుగుతుందని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులకు బోనస్‌, ఇతర బెనిఫిట్స్‌ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. 21శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని.. దాంతో ప్రతి ఏటా రూ.418.11కోట్ల భారం పడుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సర్వీసులో ఉన్న 42,057 మంది ఎంప్లాయిస్‌కు, 2017 నుంచి రిటైర్డ్ అయిన 11,014 మంది ఉద్యోగులు మెుత్తంగా 53,071 మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని.. దాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ బాధ్యతను నెరవేరుస్తుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈసందర్భంగా ఆర్టీసీ సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..