Telangana: ప్రజలకు గుడ్ న్యూస్.. భాగ్యనగరం నుంచి ఐదు జిల్లాలకు బేఫికర్ జర్నీ..
కరీంనగర్ రాజీవ్ రహదారికి అనుసంధానంగా రాబోయే ఎలివేటెడ్ కారిడార్. ఇటీవలే కేంద్రం లైన్ క్లియర్ చేయడంతో నిర్మాణంపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ప్యారడైజ్ నుంచి ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు 18 కిలోమీటర్ల మేర సాగి రాజీవ్ రహదారిని టచ్ చేస్తుంది ఈ కారిడార్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
రాజధాని హైదరాబాద్ To ఉత్తర తెలంగాణ కనెక్టివిటీపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఐదు ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యంత వేగంగా చేరుకునేలా రూట్లన్నీ క్లియర్ చేస్తోంది కొత్త ప్రభుత్వం. ఇందుకోసం రెండు కారిడార్లు సిద్దం చేస్తోంది. ఈ రెండూ రెండు గేట్‌వేలుగా మారబోతున్నాయి ఉత్తర తెలంగాణకు.
మొదటిది.. కరీంనగర్ రాజీవ్ రహదారికి అనుసంధానంగా రాబోయే ఎలివేటెడ్ కారిడార్. ఇటీవలే కేంద్రం లైన్ క్లియర్ చేయడంతో నిర్మాణంపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. ప్యారడైజ్ నుంచి ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు 18 కిలోమీటర్ల మేర సాగి రాజీవ్ రహదారిని టచ్ చేస్తుంది ఈ కారిడార్. ఇది పూర్తయితే కుత్బుల్లాపూర్, మేడ్చల్ పరిసర ప్రాంతాలు హైటెక్ సిటీతో సమానంగా అభివృద్ధి చెందే ఛాన్సుందని చెబుతోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వైపు వెళ్లేవారికి ఇది గుడ్‌న్యూస్. ఇక మీదట ఈ జిల్లాల వారు ట్రాఫిక్-ఫ్రీ జర్నీ చేసుకోవచ్చు.
ఇక రెండోది.. మేడ్చల్ జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యే విధంగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్. సీఎం రేవంత్ చేతుల మీదుగా కాసేపట్లో శంకుస్థాపన జరుపుకోనుంది. 1580 కోట్ల ఖర్చుతో 5.3 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ రోడ్-కమ్-మెట్రో రైల్ కారిడార్.. ఉత్తర తెలంగాణకు మరో ఎంట్రీ పాయింట్ కాబోతోంది. జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలకు, జంటనగరాల్లో వాహనదారులకు గుడ్ న్యూస్ ఇది.
–ఆరు లేన్లలో నిర్మించే ఈ కారిడార్ నిర్మాణంతో NH-44కి మహర్దశ పట్టే ఛాన్సుంది. –ఈ ఎలివేటెడ్ కారిడార్ మరో స్పెషాలిటీ ఏంటంటే.. రోడ్డుమార్గంతో పాటు, మరికొన్నిరోజుల్లో ఇక్కడ మెట్రో లైన్ నిర్మిస్తారు. ఈ రకంగా నగరంలో ఇది తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కాబోతోంది. –హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్-ఆదిలాబాద్ మీదుగా సాగే NH-44పై ఇక ట్రాఫిక్ నరకం ఉండబోదన్నమాట. –సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు దగ్గర ముగుస్తుంది.
సో… ఈ రెండు కారిడార్లూ సిద్ధమైతే.. ఉత్తర తెలంగాణ టు హైదరాబాద్.. హైదరాబాద్ టు ఉత్తర తెలంగాణ.. ఇక బేఫికర్‌గా ప్రయాణించొచ్చన్నమాట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..