AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే.. వెంటనే ఇలా చేస్తే..

చలికాలం చలితో పాటు మన శరీరంలో కొన్ని మార్పులను కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో కిడ్నీల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మామూలుగా ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మనకు దాహం వేయడం తగ్గుతుంది. ఫలితంగా మనం నీరు త్రాగడం తగ్గిస్తాం. కానీ ఇదే కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం నుండి వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీలు ఈ సీజన్‌లో మరింత ఒత్తిడికి లోనవుతాయి.

Krishna S
|

Updated on: Dec 28, 2025 | 12:30 PM

Share

దాహం వేయడం లేదని నీరు తాగకపోతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా చలికి వేడివేడిగా ప్రాసెస్ చేసిన, ఉప్పగా ఉండే ఆహారాలు తినడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది.
చలి వల్ల వ్యాయామం తగ్గించడం జీవక్రియపై ప్రభావం చూపుతుంది.

దాహం వేయడం లేదని నీరు తాగకపోతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా చలికి వేడివేడిగా ప్రాసెస్ చేసిన, ఉప్పగా ఉండే ఆహారాలు తినడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. చలి వల్ల వ్యాయామం తగ్గించడం జీవక్రియపై ప్రభావం చూపుతుంది.

1 / 5
ఎవరు ఎంత నీరు తాగాలి: పని స్వభావాన్ని బట్టి నీరు తాగే పరిమాణం మారాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులు, డెలివరీ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. ఐటీ నిపుణులు, అకౌంటెంట్లు ఏసీ గదుల్లో ఉండటం వల్ల రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు సరిపోతుంది.

2 / 5
గోరువెచ్చని నీరే శ్రీరామరక్ష: చలికాలంలో చల్లని నీటికి బదులు గోరువెచ్చని నీరు తాగడం కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

3 / 5
ఆహారంలో మార్పులు: ఉప్పు తగ్గించండి: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్రంలో కాల్షియం పెరిగి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, దుంపలు, చాక్లెట్ మరియు అధికంగా టీ తాగడం నియంత్రించాలి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు మరియు గింజలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.

4 / 5
వ్యాయామం మరువకండి: చలి అని దుప్పటి ముసుగుతన్ని పడుకోకుండా రోజూ కనీసం కొద్దిసేపు నడక లేదా ఏవైన వ్యాయామాలు చేయాలి. ఇది శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. కిడ్నీలు మన శరీరానికి ఫిల్టర్లు వంటివి. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. తగినంత నీరు తాగుతూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ చలికాలంలో కిడ్నీ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

5 / 5
Follow Us
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..

భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..

వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..

టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..

ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!

రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో

నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి

శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..!

ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది వీడియో