Gold-Silver: వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా.. ఇప్పుడే కోనేయండి
పంచలోహాలను నమ్ముకో...సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచుకో అని ఆర్థిక గురువులు సలహా ఇస్తున్నారు. స్టాక్ మార్కెట్‌ను పక్కన పెట్టి లోహశాస్త్రాన్ని ఔపోసన పట్టమని అర్థశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇదేం కామెడీగా చెబుతున్నది కాదు. 2025లో హై రిటర్న్స్ ఇచ్చినవాటిలో ఐదు లోహాలు ఉన్నాయి. సిల్వర్ శివతాండవం చేస్తుంటే, దాని ముందు బంగారం కూడా వెలవెలబోతోంది. నయాసాల్‌లో నయా జోష్‌తో... గోల్డ్ 2 లకారాలకు, సిల్వర్ 5లక్షల రూపాయలకు చేరొచ్చనే అంచనాలతో సామాన్యుడి గుండె గుభేల్‌మంటోంది.

2025లో అత్యధికంగా ఆదాయం ఇచ్చినవాటిల్లో పంచలోహాలు ఉన్నాయి. వాటిల్లో అత్యధికంగా సిల్వర్ 134.02 శాతం పెరిగింది. రెండో స్థానంలో ప్లాటినం నిలిచింది. అది 133.76 శాతం పెరిగింది. ఇక బంగారం 73.42 శాతం, కాపర్ 36.60 శాతం చొప్పున పెరిగాయి. ఈ ఏడాదిలో అల్యూమినియం…16.27 శాతం పెరిగింది. ఇక కొత్త ఏడాదిలో గోల్డ్‌కి, సిల్వర్‌కి కొత్త టార్గెట్లు పెడుతున్నారు నిపుణులు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 2 లక్షలకు, కిలో వెండి 5లక్షల రూపాయల వరకు పెరగవచ్చని జోస్యం చెబుతున్నారు. గత వారం రోజుల్లో వెండి 40 వేల రూపాయలు పెరగడమే దీనికి నిదర్శనమంటున్నారు మార్కెట్ నిపుణులు. కొత్త ఏడాది ఈ లోహాలు గరిష్ట స్థాయికి చేరతాయంటున్నారు వాళ్లు. ఇది సామాన్యుడికి షాక్ ఇస్తుంటే..ఇన్వెస్టర్లకు మాత్రం జాక్‌పాట్ తగిలినట్లయింది.
ఇన్నాళ్లూ మనం బంగారం ధరలు పెరుగుతున్నాయనే కంగారుపడ్డాం. కానీ ఇప్పుడు సిల్వర్ చేస్తున్న శివతాండవం చూస్తుంటే..జనానికి కళ్లు తిరిగిపోతున్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ అక్షరాలా లక్షా 40 వేల రూపాయలను దాటేసింది. ఇక ఒక్క రోజులో 20 వేలు పెరిగి, 2 లక్షల 74వేల రూపాయలకు చేరింది వెండి. నయా సాల్‌లో, నయా రేట్లతో ఇవి జనాన్ని బెంబేలెత్తించడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఒక్క డిసెంబర్‌లోనే వెండి ధర దాదాపు 45% పెరిగింది. అంటే, ఎవరైతే వెండిని చిన్నచూపు చూశారో, వారికి ఇప్పుడు మార్కెట్ చుక్కలు చూపిస్తోంది.
వెండి, బంగారం ఇలా పరుగులు తీయడానికి, 3 బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒకటి ఇండస్ట్రియల్ డిమాండ్. ఇప్పుడు ప్రపంచం…సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్ల వైపు పరుగులు తీస్తోంది. వీటన్నింటి తయారీకి వెండి చాలా అవసరం. ముఖ్యంగా AI చిప్స్, సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండిని విపరీతంగా వాడుతున్నారు. కానీ గనుల్లో దొరికే వెండి అంతంత మాత్రమే. దాని డిమాండ్ మాత్రం ఆకాశాన్ని తాకుతోంది. సప్లయ్ అయ్యేది గోరంత…కావాల్సింది కొండంత! దీంతో వెండి తాండవం ఆగట్లేదు. ఇక అమెరికన్ ఫెడ్…వడ్డీ రేట్లను తగ్గిస్తుండడంతో, ఇన్వెస్టర్లు డాలర్లను వదిలి బంగారం, వెండిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ప్రముఖ ఆర్థిక నిపుణులు రాబర్ట్ కియోసాకి…బాంబు పేల్చారు.
త్వరలో వెండి ధర ఔన్సుకి 200 డాలర్లకు చేరుతుందట. అదే జరిగితే… మన ఇండియాలో కిలో వెండి ధర రూ. 5 లక్షలు దాటొచ్చు! ఇది వినడానికి భయంగా ఉన్నా, ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే అసాధ్యం అనిపించడం లేదు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్‌మన్ సాచ్స్ వంటి దిగ్గజ బ్యాంకులు కూడా 2026లో బంగారం, వెండికి తిరుగులేదని చెబుతున్నాయి. ఇండియాలో ఇది పెళ్లిళ్ల సీజన్. నవంబర్-డిసెంబర్ మధ్యలో దాదాపు 46 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. పెళ్లి అనగానే బంగారంతో పాటు వెండి సామాన్లు, కాళ్ళ పట్టీలు కొనడం మన సంప్రదాయం. కానీ ఇప్పుడున్న రేట్లకు… కిలో వెండి కొనాలంటే రెండున్నర లక్షల పైన పెట్టాలి. దీంతో చాలా మంది లైట్ వెయిట్ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026లో కూడా ఈ ధరల మోత తగ్గేలా లేదు. సోలార్, AI టెక్నాలజీ పెరుగుతున్నంత కాలం వెండికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి, మీ ఇంట్లో శుభకార్యాలు ఉంటే, లేదా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే…రేపు తగ్గుతుందేమో అని ఎదురుచూడటం కంటే, ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే… ఒకప్పుడు బంగారం “గోల్డెన్ కింగ్” అయితే, ఇప్పుడు వెండి “డైమండ్”లా మారుతోంది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
