AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా? ఈ విషయాల్లో జాగ్రత్త!

భారత అర్థశాస్త్ర పితామహుడిగా పేరొందిన చాణక్యుడు వివిధ అంశాలపై చెప్పిన అనేక విషయాలు పూర్వ కాలం నుంచి నేటి వరకు మానవ జీవితంలో ఎంతో కీలకంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లోనే గాక, మనిషి వ్యక్తిత్వం గురించి కూడా ఆయన అనేక అంశాలను స్పష్టంగా తెలియజేశారు. మంచి, చెడుల మధ్య వ్యత్యాన్ని స్పష్టం చెప్పారు. మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి వ్యక్తులను నమ్మాలో ఎలాంటి వ్యక్తులను నమ్మకూడదో స్పష్టం తెలియజేశారు.

చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?  ఈ విషయాల్లో జాగ్రత్త!
Chanakya
Rajashekher G
|

Updated on: Dec 28, 2025 | 12:37 PM

Share

ఆచార్య చాణక్యుడు ఆర్థికశాస్త్రంతోపాటు నీతి శాస్త్రాన్ని మనకు అందించి అనేక రంగాల్లో ఉత్తమంగా రాణించేందుకు అనేక మార్గనిర్దేశనాలు చేశారు. ఆయన రచించిన నీతి శాస్త్ర పుస్తకంలో మానవ జీవితంలోని ప్రతి అంశం గురించి వివరణాత్మకంగా పేర్కొన్నారు. వ్యక్తుల స్వభావాలను గూర్చి వివరించారు. మంచి, చెడు వ్యక్తుల మధ్య తేడాలను స్పష్టం చెప్పారు. ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి మోసపోయేవాళ్ల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగానే ఉంది. అందుకే చాణుక్యుడు చెప్పిన మాటలను ఒకసారి తలచుకోవాలి.

సమాజంలో మొదట మీ నమ్మకాన్ని సంపాదించుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే, వారు ఆపై పూర్తిగా నమ్మిన తర్వాత తమ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని మోసం చేస్తారు. కానీ, అప్పటికే మీరు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. మీరు ఆ వ్యక్తిని నమ్మి మోసపోయామని బాధపడతారు. ఇలాంటి పరిస్థితులను తప్పించుకునేందుకు చాణక్యుడు చెప్పిన మాటలు వినాలి. అవతలి వ్యక్తి నిజాయితీపరుడా? అనే విషయాన్ని గుర్తించేందుకు కొన్ని ప్రమాణాలను తెలియజేశారు చాణక్యుడు. ఆ ప్రమాణాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

త్యాగం: ఇతరులను సంతోషంగా ఉంచేందుకు తమ సొంత ఆనందాన్ని త్యాగం చేసే వ్యక్తులు నిజాయితీపరులని చెప్పవచ్చు. వారి నిజాయితీని ఎవరూ అనుమానించకూడదు. అలాంటివారిని మీరు నమ్మవచ్చు. త్యాగం చేసే స్వభావం కలిగినవారు మీకు ఎప్పుడూ హాని చేయరని చాణక్యుడు వివరించారు.

స్వభావం: మీరు ఒక వ్యక్తితో ప్రయాణించాలనుకున్నప్పుడు మొదట ఆ వ్యక్తి స్వభావాన్ని పరిశీలించాలని చాణక్యుడు చెప్పాడు. ఆ వ్యక్తికి ఎవరి గురించి ఎప్పుడూ చెడు ఆలోచనలు ఉండకపోతే.. ఆ వ్యక్తి నిజాయితీపరుడు అని స్పష్టం చేశారు.

గుణాలు: చాణక్యుడు రెండు రకాల లక్షణాలు ఉంటాయన్నారు. వాటిలో మంచి లక్షణాలు, చెడు లక్షణాలు ఉంటాయని తెలిపారు. సోమరితనం, ఇతరుల పట్ల అగౌరవం, కోప స్వభావం, అసూయపడే వైఖరి వంటివి చెడు లక్షణాలు అని చెప్పారు. అలాంటి గుణాలు కలిగిన వ్యక్తులను ఎప్పుడూ నమ్మకూడదని, వారు ప్రమాదకారులని చాణక్యుడు తెలిపారు.

కష్టపడే తత్వం: కష్టపడి పనిచేసేవారు నిజాయితీపరులుగా ఉంటారని చాణక్యుడు చెప్పారు. వారిని నమ్మవచ్చన్నవారు. అలాంటి వ్యక్తులు కూడా మీకు ఎప్పటికీ హాని చేయరని వివరించారు.

చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?