Kamareddy: ‘ఏ లెక్కన శిలాఫలకంపై ఆయన పేరు పెట్టారు’.. భగ్గున మండిన ఎమ్మెల్యే కాటిపల్లి
కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవంలో వివాదం రాజుకుంది. ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఆ పూర్తి డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందా...
కామారెడ్డిలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవంలో వివాదం రాజుకుంది. ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అదనపు గదుల ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం ఉండదా అని ప్రశ్నించారు. కామారెడ్డి నుంచి పారిపోయి ఓడిపోయిన వ్యక్తితో ప్రారంభోత్సవం చేయిస్తారా అని నిలదీశారు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలాఫలకంపై ఏ జీఓ ప్రకారం పెట్టారో కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగితా ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకపోగా.. ప్రభుత్వ ఆస్పత్రికి ప్రభుత్వ సలహాదారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారా అని ఎద్దేవా చేశారు. మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఉండగా ఉదయం 11 గంటలకే వెంకట రమణారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖి చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆస్పత్రిలో.. సూపరింటెండెంట్ ఛాంబర్ లో కూర్చుని పలు అంశాలపై వివరాలు సేకరించారు.
ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా DSP ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఉన్న బయట వ్యక్తులందరినీ బయటకు పంపించేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా ఆస్పత్రికి చేరుకొని.. ఆస్పత్రి పై భాగంలో 4.53 కోట్లతో నిర్మించిన 100 పడకల గదులు, ఇతర వార్డులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ప్రారంభించారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు షబ్బీర్ అలీ. మెడికల్ హాస్పిటల్, దోమకొండ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం కంప్లీట్ అవ్వగానే కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..