AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వామ్మో జర్రుంటే నిండు ప్రాణం బలయ్యేది.. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయొద్దు.. వీడియో

హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. రైలు దిగుతూ.. కిందపడిన యువకుడిని.. అక్కడున్న వారు రెప్పపాటులో కాపాడారు.. వరంగల్‌కు చెందిన సాదుల మణిదీప్ (31) బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.

Hyderabad: వామ్మో జర్రుంటే నిండు ప్రాణం బలయ్యేది.. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయొద్దు.. వీడియో
Viral Video
Vijay Saatha
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 28, 2025 | 11:32 AM

Share

హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. రైలు దిగుతూ.. కిందపడిన యువకుడిని.. అక్కడున్న వారు రెప్పపాటులో కాపాడారు.. వరంగల్‌కు చెందిన సాదుల మణిదీప్ (31) బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. సాధారణ టికెట్ తీసుకున్న అతడు, రైలు వచ్చేసరికి గందరగోళంలో ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీ హెచ్‌ఎ1 లో ఎక్కాడు.. కొద్ది సేపటికే తన పొరపాటు తెలుసుకున్న మణిదీప్, రైలు కదిలిపోతున్న సమయంలో కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. ఆ క్షణంలోనే అతని కాలు జారింది.. దీంతో రైలు కిందపడే పరిస్థితి తలెత్తింది. అయితే అదృష్టవశాత్తు అక్కడే విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ (ఏసీఎం) గోవింద రావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుస్మిత ఆ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. చురుగ్గా స్పందించిన ఇద్దరూ మణిదీప్‌ను రైలు చక్రాల దగ్గర నుంచి పక్కకు లాగి ప్రాణాపాయం నుంచి రక్షించారు. క్షణాల్లో జరిగిపోయే ప్రమాదాన్ని పసిగట్టిన వీరి అప్రమత్తతను రైల్వే అధికారులు ప్రశంసించారు.

కాచిగూడ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం.. మణిదీప్ ప్రాణాలు నిలిచింది పూర్తిగా రైల్వే సిబ్బందిలోని చాకచక్యంతోనని తెలిపారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడకూడదని, రైలు నడుస్తున్న సమయంలో ఎక్కడం–దిగడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే ఈ ఘటనలో మణిదీప్ ప్రాణాలు కోల్పోయి ఉండేవాడని ఆయన తెలిపారు.

వీడియో చూడండి..

ప్రయాణికుల భద్రత కోసం రైల్వే అధికారులు తరచుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆర్పీఎఫ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎక్కే ముందు అన్ని వివరాలు చూసుకున్న తర్వాతనే సరైన ట్రైన్ ఎక్కాలని పాసింజర్లకు రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు సైతం జాగ్రత్తలు పాటించాలని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి