AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మందుబాబులు అలెర్ట్.. ఇక తాగి వాహనం నడిపితే దబిడి దిబిడే.!

హైదరాబాద్ పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. కర్నూల్ ఘోర ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. తాగి వాహనం నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: మందుబాబులు అలెర్ట్.. ఇక తాగి వాహనం నడిపితే దబిడి దిబిడే.!
Drunk And Drive Test
Lakshmi Praneetha Perugu
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 28, 2025 | 12:39 PM

Share

హైదరాబాద్ పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. కర్నూల్ ఘోర ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. తాగి వాహనం నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాగి వాహనం నడిపి వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరులు సైతం ప్రాణాలు కోల్పోయేలా ఘటనలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు అభివర్ణించారు.

కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘటనే ఉదాహరణగా హైదరాబాద్ పోలీసులు చూపిస్తున్నారు.. శివశంకర్ అనే యువకుడు తాగి వాహనం నడిపి డివైడర్ను ఢీ కొట్టి ప్రమాదానికి గురికాగా అతడు నడిపిన బైక్ రోడ్డు మీదే పడి ఉండటం ఆ తర్వాత అదే రూట్లో వెళుతున్న వి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్ను ఢీకొనటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై 19 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో అసలు శివశంకర్ అనే యువకుడు మద్యం సేవించకుండా ఉండి ఉంటే 19 మంది ప్రాణాలతో ఉండి ఉండేవారని పోలీసులు చెబుతున్నారు. ఆ యువకుడు మద్యం సేవించడం వల్లే ఈరోజు 19 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

కర్నూల్ ఘటన తర్వాత హైదరాబాదులోనూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. తాగి వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యే వారిని ఉగ్రవాదులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ అభివర్ణించారు. తమ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు సైతం తీస్తున్న వారిని ఉగ్రవాదులుగా చూడటమే కరెక్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూల్ ఘటన తర్వాత హైదరాబాదులో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం డ్రంకెన్ తనిఖీలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ సజనార్ స్పష్టం చేశారు.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?