Hyderabad: లక్ష ఇస్తే లక్షన్నర.. బుక్స్‌ స్కాన్‌ పేరుతో 15 కోట్లకు పైగా బురిడీ.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే లక్షన్నర, రెండు లక్షలు ఇస్తామంటూ 15 కోట్లకు పైగా కొల్లగొట్టారు. సుమారు 630మందిని మోసంచేసి ఢిల్లీకి చెక్కేశారు. బుక్స్‌, నవలలను స్కాన్‌ చేసిస్తే చాలు డబ్బులే డబ్బులంటూ ఈ మోసానికి పాల్పడ్డారు.

Hyderabad: లక్ష ఇస్తే లక్షన్నర.. బుక్స్‌ స్కాన్‌ పేరుతో 15 కోట్లకు పైగా బురిడీ.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
Fruad
Follow us

|

Updated on: Nov 19, 2022 | 7:57 AM

అప్పుడెప్పుడో కరక్కాయల పొడి పేరుతో మోసం. మొన్నేమో బుక్స్‌ స్కాన్‌ అంటూ ఫ్రాడ్‌. ఆ తర్వాత వత్తులతో పేరుతో మెత్తగా దోపిడీ. సేమ్‌ టు సేమ్‌ ఇలాంటి ఫ్రాడే మరొకటి బయటపడింది తాజాగా హైదరాబాద్‌ లో. నమ్మించి మోసం చేయడమే వాళ్ల పెట్టుబడి. పెద్దగా కష్టపడకుండానే కోట్లకు కోట్లు కొల్లగొట్టేయాలన్నదే లక్ష్యం. ఇది, గుర్తించలేకపోతున్న జనం.. మోసగాళ్ల చేతిలో చిక్కుకుని నిండా మునిగిపోతున్నారు. తాజాగా డిజిటల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వందల మందిని ముంచేశారు కేటుగాళ్లు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే లక్షన్నర, రెండు లక్షలు ఇస్తామంటూ 15 కోట్లకు పైగా కొల్లగొట్టారు. సుమారు 630మందిని మోసంచేసి ఢిల్లీకి చెక్కేశారు. బుక్స్‌, నవలలను స్కాన్‌ చేసిస్తే చాలు డబ్బులే డబ్బులంటూ ఈ మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. 10వేల పేపర్లు స్కాన్‌ చేస్తే 50వేలు క్యాష్‌ అంటూ నిండా ముంచేశారు. బాధితుల ఫిర్యాదుతో ప్రధాన నిందితుడు అమిత్‌శర్మను అరెస్ట్‌ చేశారు సీసీఎస్‌ పోలీసులు. జనాన్ని నమ్మించడానికి మొదట్లో లక్షకు రెండు లక్షలు ఇచ్చిన అమిత్‌, తాను అనుకున్న టార్గెట్‌ రీచ్‌ కాగానే అసలు మోసానికి తెరలేపాడు. డిపాజిట్స్‌ పేరుతో కోట్ల రూపాయలు వసూలుచేసి ఢిల్లీకి పారిపోయాడు. దాదాపు ఐదు నెలల తర్వాత సూత్రధారి అమిత్‌శర్మను అరెస్ట్‌చేసి కటకటాల వెనక్కిపంపారు పోలీసులు.

నిందితులు బంజారా హిల్స్‌లో ఆఫీస్ ఓపెన్ చేసి, ఉద్యోగులను నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. వారు కూడా ఇందులో పెట్టుబడలు పెట్టారని నిర్ధారించారు. ఈ స్కీంలో చేరాలంటే లక్ష రూపాయలు ముందస్తుగా డిపాజిట్ తీసుకున్నారు. లక్ష పెడితే లక్ష యాభై వేలు, 2 లక్షలు వరకు ఇచ్చారు. కొంత మంది 25 లక్షలు వరకు ఈ స్కీంలో పెట్టుబడులు పెట్టి మోసపోయారని పోలీసలు వెల్లడించారు. ఈ స్కీం ద్వారా వచ్చిన నగదుతో కొందరు నిందితులు ఢిల్లీకి పరారు అయ్యారని.. గతంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
ఆ స్టాక్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు