AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సాగర తీరాన నేటి నుంచే కార్ రేస్.. నాలుగు రౌండ్లల్లో పోటీలు.. అభిమానులకు పండగే..

హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ కార్ రేస్ కు సమయం ఆసన్నమైంది. నేటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్న పోటీలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్ రేస్..

Hyderabad: సాగర తీరాన నేటి నుంచే కార్ రేస్.. నాలుగు రౌండ్లల్లో పోటీలు.. అభిమానులకు పండగే..
Car Race In Hyderabad
Ganesh Mudavath
|

Updated on: Nov 19, 2022 | 7:13 AM

Share

హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ కార్ రేస్ కు సమయం ఆసన్నమైంది. నేటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్న పోటీలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కార్ రేస్ ప్రారంభం కానుంది. ఈ రేసింగ్ లో 12 కార్లు, 6 బృందాలు, 50 శాతం దేశంలోని రేసర్లు.. మరో 50 శాతం విదేశీ రేసర్లు పాల్గొననున్నారు. మొదటగా ఉదయం, మధ్యాహ్నం రేసింగ్ ప్రాక్టీస్ సేషన్ స్టార్ట్ కానుడంగా.. డిసెంబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్ లో మరోసారి రెండో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో బెంగళూరు స్పీడ్ స్టర్స్, బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్, చెన్నై, గోవా, దిల్లీ, కొచి బృందాలు పోటీ పడనున్నాయి. ఇవాళ్టి రేస్ లో హైదరాబాద్ రేసర్లు పాల్గొననున్నారు. రేస్ లో పాల్గొనున్న మల్కాజిగిరికి చెందిన అభినవ్ రెడ్డి, కొండా అనిందిత్ రెడ్డి. ఐ మ్యాక్స్ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇమ్యాక్స్ వరకు రేస్ సర్క్యుట్ పోటీ జరగనుంది. రేస్ టైం లో ట్రాక్ ను రియల్ టైం టెస్టింగ్ చేయనున్నారు.

శనివారం అట్టహాసంగా ప్రారంభం కానున్న ఈ పోటీలను రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ ఫెడరేషన్‌ సహకారంతో దేశంలోనే మొదటిసారిగా ఈ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)ను నిర్వహిస్తోంది. ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్‌ పోటీ పడనున్నారు. లీగ్‌ ఫార్మాట్‌ ప్రకారం పోటీలు నాలుగు రౌండ్లుగా జరగనున్నాయి. ఆరంభ, ముగింపు రౌండ్లకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. 2, 3 రౌండ్లను చెన్నైలో నిర్వహిస్తారు. తొలిరోజు పోల్‌ పొజిషన్‌ కోసం క్వాలిఫయింగ్‌ రేసు, ఆ తర్వాత (ఆదివారం) మూడు స్ర్పింట్‌ రేసులు జరగనున్నాయి. మూడు స్ర్పింట్‌ రేసుల్లో కలిపి ఆ రౌండ్‌లో టాపర్‌గా నిలిచిన జట్టుకు 25 పాయింట్లు, రెండో స్థానంలోని జట్టుకు 18, మూడో స్థానంలోని టీమ్‌కు 15 పాయింట్లు లభిస్తాయి.

ఈ రేసింగ్‌లో వాడే కార్లు సింగిల్‌ డ్రైవర్‌ మోడల్‌కు చెందినవి. ఈ కార్ల సామర్థ్యం, డిజైన్‌ ఎఫ్‌-3 రేసుల్లో ఉపయోగించే వాటితో పోలి ఉంటుంది. నెక్లెస్‌ రోడ్‌, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌, సచివాలయం, మింట్‌ కాంపౌండ్‌ మీదగా వచ్చే వాహనాలను పోలీసులు వేరే రూట్లలో మళ్లిస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇతర వాహనాలను అనుమతించడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..