Weather Alert: ఏపీ, తెలంగాణ వాసులకు అలర్ట్.. ఇవాళ, రేపు చుక్కలు చూపించనున్న చలి పులి..
ఏపీ, తెలంగాణ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ నమోదు అవుతోంది.
ఏపీ, తెలంగాణ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ నమోదు అవుతోంది. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఇటు కొమురం భీం జిల్లా సిర్పూర్(యు)లో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 10.1, హైదరాబాద్ శివారు తుర్కయాంజాల్‌లో 10.8, నందనవనం వద్ద 11.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. గాలిలో తేమ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోందన్నారు.
ఇక ఏజెన్సీ ఏరియాలో పాడేరు, అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇటు చింతపల్లి ఏజెన్సీలో సాయంత్రం నుంచే మంచు కురుస్తోంది. చలిగాలులు వీస్తుండడంతో మన్యం వాసులు వణికిపోతున్నారు. పొగమంచుతో మన్యం తడిచి ముద్దవుతోంది. చింతపల్లి, పాడేరు, అరకు లోయలో మంచుదుప్పటి పరుచుకుంది. అందమైన ఆంధ్రా పల్లెల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలపు సాయంత్రాలు.. నులివెచ్చని ఉషోదయాలతో పల్లెప్రాంతాలు మరింత అందాలు ఒలకబోస్తున్నాయి. పొగమంచుతో మన్యం తడిచి ముద్దవుతోంది. చింతపల్లిలో ఈ ఉదయం 9.4 డిగ్రీలకు పడిపోవడంతో జనం చలితో గజగజలాడుతున్నారు. ఇక, పాడేరు మండలంలోని మినుములూరు కాఫీ బోర్డులో 10.1, పాడేరులో 12, ఆంధ్రా ఊటీ అరకు లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇవాళ, రేపు మరింత చలి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ, రేపు చలి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి పెరుగుతున్నట్లు వాతావరణశాఖ వివరించింది. పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్&తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..