MLAs Poaching Case: మరోసారి హైకోర్టుకు బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి.. సిట్ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్..
ఇక్కడి ఫామ్ హౌస్ సెగ.. ఢిల్లీ వరకూ పాకిందా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నోటీసులపై స్థానిక కమలనాథుల ప్రయత్నం ఫలించేనా?మూడ్రోజుల..
ఇక్కడి ఫామ్ హౌస్ సెగ.. ఢిల్లీ వరకూ పాకిందా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నోటీసులపై స్థానిక కమలనాథుల ప్రయత్నం ఫలించేనా?మూడ్రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్న సంతోష్ సిట్ విచారణకు హాజరవుతారా? లేక ఆయన్ను అరెస్టు చేస్తారా? అన్నింటికన్నా మించి బీజేపీ స్టే యత్నం ఫలించేనా? ఆసక్తికర వివరాలు ఈ కథనం తెలుసుకుందాం..
తెలంగాణ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయ్. ఫామ్ హౌస్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఏకంగా బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కావల్సిందేనని నోటీసులు జారీ చేసింది. దీంతో తెలంగాణ సిట్ సెగ్ ఢిల్లీ వరకు పాకింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఈ నెల 21 ఉదయం పదిన్నరకు.. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. ఒక వేళ విచారణకు హాజరు కాకుంటే.. అరెస్టు చేస్తామని అన్నారు.
సిట్ నోటీసులపై హైకోర్టుకు బీజేపీ..
సిట్ నోటీసులపై బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బీఎల్ సంతోష్ తో పాటు తుషార్, శ్రీనివాస్ లకు సైతం నోటీసులు జారీ చేయగా.. సిట్ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. అంతకన్నా ముందు.. కరీంనగర్ కు చెందిన లాయర్ శ్రీనివాస్ కు కూడా నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. శ్రీనివాస్ కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సిట్ ఆఫీసుకు హాజరు కావాలన్నది ఈ నోటీసుల సారాంశం. బీఎల్ సంతోష్, శ్రీనివాస్ లను ఒకే సమయంలో విచారించాలన్నది సిట్ ఆలోచన.
దర్యాప్తు పేరిట సంబంధం లేని వ్యక్తులను ఇరికించేందుకు సిట్ నోటీసులతో వేధిస్తోందనీ.. ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతున్నారు టీబీజేపీ కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. మరి ఉన్నత న్యాయస్థానం.. పిటిషనర్ వాదన మన్నించేనా? లేక సిట్ పంతమే నెగ్గేనా? ఏం జరగనుంది? అన్న ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..