AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘సార్ జర ఆదుకోండి’.. ఒక్కపూట తిండి కోసం అగచాట్లు పడుతున్న వృద్ధుడి ధీనస్థితి..

అయిన వాళ్లు లేరు.. ప్రభుత్వం పట్టించుకోలేదు. వయస్సు మళ్లిన వృద్ధాప్యం.. బస్సు సెల్టర్‌లో నివాసం. తినడానికి తిండిలేక అర్థాకలితో జీవనం సాగిస్తున్నాడు.

Telangana: ‘సార్ జర ఆదుకోండి’.. ఒక్కపూట తిండి కోసం అగచాట్లు పడుతున్న వృద్ధుడి ధీనస్థితి..
Help
Shiva Prajapati
|

Updated on: Nov 19, 2022 | 8:57 AM

Share

అయిన వాళ్లు లేరు.. ప్రభుత్వం పట్టించుకోలేదు. వయస్సు మళ్లిన వృద్ధాప్యం.. బస్సు సెల్టర్‌లో నివాసం. తినడానికి తిండిలేక అర్థాకలితో జీవనం సాగిస్తున్నాడు. ఫించన్ ప్రసాధించండి మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని అర్జిస్తున్న వృద్ధుడి ధీనస్థితి ఎంటో చూద్దాం.

బాలసాని మల్లయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఈయన ఒకప్పుడు బాగానే బతికాడు. భార్య చనిపోవడం.. వృద్ధాప్యం మీదపడడంతో తినడానికి తిండి లేక.. ఉండడానికి ఇళ్లు లేక గ్రామంలోని బస్సు సెల్టర్ లో తలదాచుకుంటున్నాడు. అయినవాళ్లు లేక.. ప్రభుత్వం పట్టించుకోక ధీనావస్థలో బ్రతుకుతున్నాడు. 20ఏళ్ల క్రితమే భార్య చనిపోయినా.. వృద్ధాప్యంతో బాధపడుతున్నా ప్రభుత్వం ఇంతవరకు ఫించన్ మంజూరు చేయలేదు. చేసేదేం లేక గ్రామంలోయాచిస్తూ అర్థాకలితో జీవనం సాగిస్తున్నాడు.

అయినవాళ్లు లేకపోవడంతో తన భవిష్యత్తును ముందుగానే ఆలోచించాడు మల్లయ్య. 20ఏళ్ల క్రితం చనిపోయిన భార్య రాజమ్మ సమాధి పక్కనే తనకు ముందుగానే సమాధి నిర్మించుకున్నాడు. తాను చనిపోయాక నిర్మించుకున్న సమాధిలో పూడిచిపెట్టాలని గ్రామస్థులతో చెప్పి రెడీగా ఉంచుకున్నాడు. తినడానికి తిండిలేక ధీనస్థితి జీవిస్తున్న మల్లయ్య పరిస్థితిపై సుల్తానాబాద్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు విచారం వ్యక్తం చేశారు. గతరెండేళ్లుగా వెయ్యి రూపాయల చొప్పున దానం చేస్తున్నారు. వారిచ్చే వెయ్యితో అర్థాకలితో బ్రతుకుతున్నాడు మల్లయ్య. ఇప్పటికైనా ప్రభుత్వం.. అధికారులు స్పందించి ఫించన్ ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు మల్లయ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..