Hyderabad: ‘ఏజెంట్ సాయి ఆత్రేయ’ను మించిన క్రైమ్ కథ.. కూపీ లాగితే పోలీసుల మైండ్ బ్లాంక్..
Hyderabad: ‘జాతి రత్నాలు’ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి ఆత్రేయ’ సినిమా గుర్తుందా? క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో..

Hyderabad: ‘జాతి రత్నాలు’ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి ఆత్రేయ’ సినిమా గుర్తుందా? క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫింగర్ ఫ్రింట్స్ మాయం చేస్తుంది ఓ ముఠా. చనిపోయిన వారి ఫింగర్ ఫ్రింట్స్ సేకరించి.. వాటిని క్రైమ్స్ చేయడానికి ఉపయోగిస్తారు. హత్య కేసులో, దోపిడీ కేసులో లభించిన ఫింగర్ ఫ్రింట్స్ చెక్ చేస్తే.. ఆ ఫింగర్ ఫ్రింట్స్ వ్యక్తులు ఎప్పుడో చనిపోయి ఉంటారు. అదే ట్విస్ట్‌గా సినిమా నడుస్తుంది. అయితే, అచ్చం అలాంటి ముఠా గుట్టును రట్టు చేశారు మన పోలీసులు.
అవును, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. వేలి ముద్రలు కనిపించకుండా సర్జరీలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నిరుద్యోగుల అవసరాలే ఆసరాగా నయా మోసానికి తెరదీశారు ఈ కేటుగాళ్లు. ఏకంగా ఫింగర్ ప్రింట్ సర్జరీతో ఏమార్చేస్తున్నారు. ఈ నయా మోసానికి సంబంధించిన వివరాలను సీపీ మహేష్ భగవత్ గురువారం మీడియాకు వెళ్లడించారు.
గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చిన వారే టార్గెట్‌గా కొత్త రకం దందాకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. ఫింగర్ ప్రింట్ ఆపరేషన్‌తో వేలి ముద్రలు కనిపించకుండా సర్జరీ చేసేస్తున్నారు. కేరళలో ఆరుగురికి ఈ రకమైన సర్జరీ చేశారు. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ ముఠాపై ఫోకస్ పెట్టిన నగర పోలీసులు గుట్టు రట్టు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. నిందితుల దగ్గర నుంచి సర్జరీ కోసం వినియోగిస్తున్న వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, ఫింగర్ ప్రింట్ ఒక్కో సర్జరీ కోసం 25 వేల రూపాయలు తీసుకుంటోంది ఈ ముఠా.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
