AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: నాలుగు గ్రహాల యుతి.. సంక్రాంతి నుంచి ఆ రాశుల వారికి మహర్దశ!

Sankranti 2026 Horoscope: ఈ నెల(జనవరి) 15, 16, 17 తేదీల్లో వస్తున్న మూడు రోజుల సంక్రాంతి పర్వదినాల నుంచి కొన్ని రాశుల వారికి కొత్త యోగాలు పట్టడంతో పాటు జీవితం, జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ నెల 17న మకర రాశిలో రవి, బుధ, కుజ, శుక్రుల యుతి జరుగుతుంది. ఈ నాలుగు గ్రహాల యుతి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టడం జరుగుతుంది. మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి ఈ చతుర్గ్రాహి యోగం కొత్త జీవితాన్ని ప్రసాదిందిస్తుంది. ఈ రాశులవారు ఈ సంక్రాంతి నుంచి అత్యధికంగా రాజయోగాలు, ధన యోగాలు అనుభవించే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 08, 2026 | 6:19 PM

Share
మేషం: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు యుతి చెందడం వల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా తప్పకుండా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా కూడా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

1 / 6
వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో సహా నాలుగు గ్రహాలు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు తప్పకుండా అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా ఈ రాశివారికి రాబడి పెరిగే సూచనలున్నాయి. ఏ పని చేపట్టినా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. విదేశీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.

2 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడితో పాటు నాలుగు గ్రహాలు చతుర్థస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి బాగా పెరుగుతాయి. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది.

3 / 6
ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో నాలుగు గృహాల యుతి వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభాలనిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. లాభదాయక పరిచయాలు  కలుగుతాయి.

4 / 6
మకరం: ఈ రాశిలో నాలుగు గ్రహాల సంచారం ఈ రాశివారికి రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ది చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక మార్గాలలో ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. ప్రభుత్వ పరంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి.

5 / 6
మీనం: ఈ రాశికి లాభ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవు తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పని చేస్తున్న సంస్థ నుంచి రావలసిన సొమ్ము, బకాయిలు అందుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.. ఆర్థిక ప్రయత్నాలను, అదనపు ఆదాయ ప్రయత్నాలను పెంచుకుని లాభపడడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి.

6 / 6