Mileage Tips: మీ బైక్ మైలేజీ తక్కువగా ఇస్తోందా? ఈ టిప్స్ పాటించి ఎక్కువ మైలేజీ పొందండి..!

Mileage Tips: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం అంటే ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చాయి గానీ, ఇప్పటికీ చాలా వరకు బైక్స్..

Mileage Tips: మీ బైక్ మైలేజీ తక్కువగా ఇస్తోందా? ఈ టిప్స్ పాటించి ఎక్కువ మైలేజీ పొందండి..!
Mileage Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 31, 2022 | 10:26 PM

Mileage Tips: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం అంటే ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చాయి గానీ, ఇప్పటికీ చాలా వరకు బైక్స్ పెట్రోల్‌తోనే నడుస్తాయి. ఇక మనం దేశం విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లో విడుదల అవుతున్నాయి. అయినప్పటికీ కొన్ని భయాల కారణంగా.. వినియోగదారులు పెట్రోల్ బైక్స్‌ కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. అయితే, ఇంధన వాహనాల వినియోగంలోనూ వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానమైనది మైలేజీ సమస్య. ఎంత పెట్రోల్ పోసినా.. తక్కువ కిలోమీటర్లు ఇవ్వడంతో వాహనదారులు నిట్టూరుస్తుంటారు. అయితే, వాహనాలు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే కొన్ని చిట్కాలున్నాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టైర్లలో గాలి చూసుకోవాలి..

మీ వాహనాలలోని టైర్లలో గాలిని క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి. చాలా మంది ప్రజలు టైర్లలోని గాలిని పట్టించుకోరు. టైర్‌లో తక్కువ గాలి ఉన్నప్పుడు ఇంజిన్‌పై ఎక్కువ భారం పడుతుంది. ఫలితంగా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. తద్వారా తక్కువ మైలేజీ వస్తుంది. అందుకే టైర్లలో గాలి సరిగా ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇంజిన్‌ను ఆఫ్ చేసుకోవాలి..

ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద బైక్ నిలిపినప్పుడు.. ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి. ఇంజిన్‌ రన్నింగ్‌లో ఉంటే.. అనవసరంగా ఇంధనం ఖర్చు అవుతుంది. ఫలితంగా తక్కువ మైలేజీ వస్తుంది.

అనవసరమైన బ్రేకులు వేయొద్దు..

చాలా మంది బైక్ నడిపేటప్పుడు అనవసరంగా బ్రేక్స్ వేస్తుంటారు. ఈ అలవాటు.. బైక్ ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. దీని కారణంగా మైలేజీ కూడా వేగంగా తగ్గుతుంది.

స్పీడ్ లెవల్ మెయింటేన్ చేయాలి..

చాలా ద్విచక్ర వాహనాల్లో CVT గేర్‌బాక్స్ ఉపయోగించడం జరుగుతుంది. కంపెనీలు ఈ బైక్స్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఎకో మోడ్‌ను సూచిస్తాయి. ఇది సాధారణంగా 40 kmph నుండి 50 kmph వరకు ఉంటుంది. మంచి మైలేజీని పొందడానికి ఈ వేగాన్ని మెయింటేన్ చేయాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..