Happiness Tips: డిప్రెషన్‌ను జయించి సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే, ఇలా చేయండి..!

Happiness Tips: కోటి విద్యలు కూటి కోసమే అంటారు. ఆ కూడుకి సంతోషాన్ని జత కలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఎంత కష్టపడి పని చేసినా,

Happiness Tips: డిప్రెషన్‌ను జయించి సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే, ఇలా చేయండి..!
Happiness
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 31, 2022 | 10:26 PM

Happiness Tips: కోటి విద్యలు కూటి కోసమే అంటారు. ఆ కూడుకి సంతోషాన్ని జత కలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఎంత కష్టపడి పని చేసినా, ఎంత సంపాదించినా.. మూడు పూటు కూడు ఉన్నా సంతోషం అనేదే లేకుండా పోతోంది. ప్రస్తుత ఉరుకులు పరుగులు జీవితంలో వ్యక్తి జీవితంలో సంతోషం అనేదే లేకుండా పోతోంది. వ్యక్తి సంపాదించడం వెనుక, కెరీర్‌లో గోల్ రీచ్ అవ్వాలన్నా, ఎంచుకున్న రంగంలో ఉన్న శిఖరాలకు చేరుకోవాలన్నా.. ఈ ఆలోచనల అంతిమ లక్ష్యం సంతోషం. ఆ సంతోషం కోసమే అందరూ తీవ్రంగా శ్రమిస్తారు. సంతోషంగా ఉన్నవారే ఆరోగ్యంగా ఉంటారు. అందుకే అంటారు.. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని మించిన అదృష్టవంతుడు ఎవరూ ఉండరని. మరి ప్రస్తుత ఉరుకులు, పరుగుల బిజీ జీవితంలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

కొందరు ఏ కారణం లేకుండానే సంతోషంగా ఉంటారు. మరికొందరు డల్‌గా ఉంటారు. దీనికి భావోద్వేగంతో పాటు.. హర్మోన్లు కూడా కారణం అని నిపుణులు చెబుతున్నారు. అనందం కలిగించే డోపమైన్ అనే హార్మోన్ దీనికి కారణం అని చెబుతున్నారు. ఈ హార్మోన్ మంచి స్థాయిలో ఉత్పత్తి అయితే, ఆ వ్యక్తి నిత్యం సంతోషంగా, ముఖంపై చిరునవ్వుతో ఉంటారు. ఈ హర్మోన్ స్థాయిని సరిగ్గా ఎలా నిర్వహించాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

డోపమైన్ స్రావాన్ని ఎలా పెంచాలి?

ఇవి కూడా చదవండి

డోపమైన్ హార్మోన్ స్రావాన్ని పెంచడానికి.. రోజువారీ ఆహారంలో గ్రీన్ బీన్స్, సోయా బీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో టైరోసిన్ అమినో యాసిడ్ సరైన స్తాయిలో ఉంటుంది. ఈ ప్రోటీన్ తీసుకోవడం వలన డోపమైన్ మరింత పెరుగుతుంది. గ్రీన్ బీన్స్, సోయాబీన్స్, పాల ఉత్పత్తులు, అరటిపండ్లు, గుడ్లు, ప్రోబయోటిక్స్, చికెన్ వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు డోపమైన్ హార్మోన్ పెరిగేందుకు దోహదపడుతాయి. ఇవే కాకుండా రోజువారీ ఆహారంలో, గ్రీన్ టీ, కర్కుమిన్ (పసుపు), మెగ్నీషియం, విటమిన్ డి కూడా తీసుకోవాలి.

సంతోషంగా ఉండాలంటే ఇవి తినకూడదు..

ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి సంతోషంగా ఉండేందుకు దోహదపడవు. కొన్నిసార్లు డిప్రెషన్‌కు కారణం అవుతాయి. ఉదాహరణకు, సంతృప్త కొవ్వు ఉన్న ఆహారాలు. జంతువుల కొవ్వు, వెన్న, పామాయిల్, కొబ్బరి నూనె వంటివి అధికంగా తీసుకోవడం వలన శరీరంలో ఒత్తిడి పెరుగుతంది.

సంతోషంగా ఉండటానికి సహాయపడే ఇతర కార్యకలాపాలు..

తగినంత గంటలు నిద్రపోవాలి. ఈ నిద్ర కూడా నాణ్యతతో ఉండాలి. కనీసం 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ధ్యానం చేయాలి. ఇది భావోద్వేగాలను నియంత్రించడానికి, సంతోషంగా ఉండటానికి డోపమైన్ హర్మోన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. సంగీతం వినాలి. నచ్చిన మ్యూజిక్ వింటూ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఉదయం పూట సూర్యకాంతిలో కాసేపు ఉండాలి. ఉదయాన్నే వచ్చే సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి డోపమైన్ స్రావాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మరిన్ని హ్యూమ్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..