Bangladesh: దీపు చంద్ర దాస్ హత్య కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారి అరెస్ట్..!
బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో హిందూ మైనారిటీ పౌరుడు దిపు చంద్ర దాస్‌ను దారుణంగా హత్య చేసిన గుంపులో ప్రధాన నిందితుడు యాసిన్ అరాఫత్‌ను దైవదూషణ ఆరోపణలపై బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్న యాసిన్ అరాఫత్ ఈ భయంకరమైన దాడిని ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. పక్కాగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు.

బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలో హిందూ మైనారిటీ పౌరుడు దిపు చంద్ర దాస్‌ను దారుణంగా హత్య చేసిన గుంపులో ప్రధాన నిందితుడు యాసిన్ అరాఫత్‌ను దైవదూషణ ఆరోపణలపై బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్న యాసిన్ అరాఫత్ ఈ భయంకరమైన దాడిని ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. పక్కాగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దారుణాల మధ్య, ఈ సంఘటనపై ఆ దేశం ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కోంటుంది.
నిజానికి, డిసెంబర్ 18, 2025న, బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాలోని ఒక వస్త్ర కర్మాగారంలో 27 ఏళ్ల హిందూ మైనారిటీ కార్మికుడు దిపు చంద్ర దాస్‌ను ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ బలవంతంగా ఉద్యోగం నుండి తొలగించాడు. అంతేకాదు అతన్ని బంగ్లా తీవ్రవాదులకు అప్పగించారు. ఆ తర్వాత హింసాత్మక గుంపు అతన్ని దారుణంగా కొట్టి చంపి, అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి, నిప్పంటించింది. దిపు సహోద్యోగులలో ఒకరు కూడా అతని హత్యలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రధాన నిందితుడు యాసిన్ అరాఫత్ షేఖబరి మసీదులో ఇమామ్‌గా పనిచేశాడు. గత 18 నెలలుగా మదర్సాలో బోధిస్తున్నాడని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. అయితే, దిపు చంద్ర దాస్ హత్య తర్వాత, యాసిన్ ఆ ప్రాంతం నుండి పారిపోయి గత 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. అతను రాజధాని ఢాకాలోని అనేక మదర్సాలలో దాక్కున్నాడు. తప్పుడు గుర్తింపును ఉపయోగించి అతను సుఫా మదర్సాలో బోధనా ఉద్యోగాన్ని కూడా సంపాదించాడు. అయితే, డెమ్రా పోలీసులు, బంగ్లాదేశ్ మెట్రోపాలిటన్ పోలీసుల సహకారంతో గురువారం (జనవరి 8, 2026) యాసిన్ అరాఫత్‌ను అరెస్టు చేశారు.
యాసిన్ అరాఫత్ ఈ భయంకరమైన దాడిని ప్లాన్ చేసి, యువ హిందూ మైనారిటీ అయిన దిపు చంద్ర దాస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి జనసమూహాన్ని ప్రేరేపించాడని పోలీసులు తెలిపారు. స్థానిక సమాజంలో అతని నాయకత్వం కారణంగా, అతిత్వరగా ఒక పెద్ద సమూహాన్ని సమీకరించాడని, అది ప్రాణాంతక దాడికి దారితీసిందని పోలీసులు వెల్లడించారు. అరాఫత్ ఆ గుంపును దాడికి ప్రేరేపించడమే కాకుండా, దీపును స్వయంగా ఒక కూడలికి లాక్కెళ్లి, అక్కడ చెట్టుకు ఉరితీసి, ఆపై స్వయంగా నిప్పంటించాడని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 21 మందిని అరెస్టు చేశామని, వీరిలో తొమ్మిది మంది కోర్టులో నేరాన్ని అంగీకరించారని ఢాకా పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
