దారి వెంట వెళ్తున్న మూడేళ్ల బాలుడు.. ఒక్కసారిగా దాడి చేసిన 15 కుక్కలు..!
చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ఇంట్లో నుండి పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లితండ్రులు వణికిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మూడేళ్ల బాలుడిపై సుమారు 15 కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని రక్షించిన స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో వీధి కుక్కల దాడిలో మూడు సంవత్సరాల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దౌల్తాబాద్ లోని పదవ వార్డులో అబ్బు బాకర్ అనే మూడు సంవత్సరాల బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా 15 కుక్కల మంద బాలుడిపై దాడి చేసింది. కిందపడ్డ బాలుడిపై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి అరుపులు విని అక్కడే ఉన్న మహిళలు పరిగెత్తుకుంటూ వచ్చారు. కుక్కలను రాళ్ళతో కొట్టి బాలుడిని రక్షించారు.
అయితే, అప్పటికే బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడి కుటుంబీకులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తండ్రి అజిజు ఖురేషి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులు తీవ్రమయ్యాయని చిన్నారులను మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడ్డ బాలుడికి మెరుగైన వైద్యం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..