సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో దొరికేది ఒక్క అరటి పండు మాత్రమే. పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ దీన్ని ఇష్టంగా తింటారు
TV9 Telugu
అరటి పండ్లు తక్షణ శక్తికి, తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే తినే సమయం, పండు మగ్గిన స్థాయిని బట్టి దీనిలోని పోషకాలు అందుతాయట
TV9 Telugu
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనకు అందాలంటే అరటి పండును తీసుకునే క్రమంలో కొన్ని మెలకువలు పాటించాలని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
ఉదయాన్నే ఖాళీ కడుపున వర్కౌట్ చేసేవారు త్వరగా డీహైడ్రేట్ అవుతారు. శక్తినీ వేగంగానే కోల్పోతారు. ఇలాంటి సమయంలో అరటి పండు మంచి ఆహారం
TV9 Telugu
కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండును తీసుకోకపోవడమే మంచిదట. రాత్రిపూట అరటి పండు తినకపోవడమే మేలు. అలా తీసుకోవడం వల్ల ఒక్కోసారి జలుబు వంటి సమస్యలు వస్తాయి
TV9 Telugu
పండ్లు, లేదంటే పాలతో కలిపి అరటి పండు అస్సలు తీసుకోకూడదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అరటి పండు తినకూడదుమరి
TV9 Telugu
అలాగు అరటి పండు తినే సమయం, మగ్గిన స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నవి కావాలంటే మగ్గని అరటి పండు మంచి ఎంపిక
TV9 Telugu
ఇందులో జీర్ణక్రియ రేటును మెరుగుపరిచే ప్రి బయోటిక్స్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి తీరుతుంది. కాస్త పండినవైతే తియ్యగా ఉంటాయి. తేలికగా జీర్ణమవుతుంది