AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రేమించిందని కన్న కూతురిని చంపిన తండ్రి.. కాళ్లు, చేతులు కట్టేసి.. దారుణంగా..

తండ్రి మాటలను పెడచెవిన పెట్టిన గీత ..అవేవీ పట్టించుకోకుండా తన ప్రేమను కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈనేపధ్యంలోనే మంగళవారం బాలిక తల్లి పొలం పనులకు వెళ్లింది. మరో కుమార్తె, కుమారుడు కూడా ఇంట్లో లేరు.

Telangana: ప్రేమించిందని కన్న కూతురిని చంపిన తండ్రి.. కాళ్లు, చేతులు కట్టేసి.. దారుణంగా..
Honor Killing
Shaik Madar Saheb
|

Updated on: Oct 26, 2022 | 9:37 AM

Share

ప్రేమ పేరుతో కుటుంబ పరువు తీస్తుందంటూ కన్నకూతురిని విచక్షణా రహితంగా నరికి చంపిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో కలకలం రేపింది. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు ముగ్గురు పిల్లలు.. వారిలో గీత అనే 15ఏళ్ల అమ్మాయి పదో తరగతి చదువుతోంది. గత కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో ఉందని తెలుసుకున్న తండ్రి కన్నెర్ర చేశాడు. ఇదే విషయంలో కూతురిని నిలదీశాడు. కుటుంబం పరువు తీయకంటూ హెచ్చరించాడు. కానీ తండ్రి మాటలను పెడచెవిన పెట్టిన గీత ..అవేవీ పట్టించుకోకుండా తన ప్రేమను కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈనేపధ్యంలోనే మంగళవారం బాలిక తల్లి పొలం పనులకు వెళ్లింది. మరో కుమార్తె, కుమారుడు కూడా ఇంట్లో లేరు. ఇదే సమయంలో ఇంట్లోనే ఉన్న తండ్రి మరోసారి కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై, విచక్షణ కోల్పోయిన రాజశేఖర్‌ కాళ్లు, చేతులు కట్టేసి.. కన్న కూతురిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.

అమ్మాయి ప్రేమించిన యువకుడు అదే సామజిక వర్గానికి చెందివాడని, అమ్మాయి కుంటుంబంతో బంధుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఇంట్లో ఈ విషయమై గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ పరువు తీయకంటూ తండ్రి, కుటుంబ సభ్యులు గీతకు పలు మార్లు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. సొంత కూతురిని తండ్రి హత్య చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.

హత్య తరువాత రాజశేఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. కన్నబిడ్డకు ముల్లు గుచ్చుకుంటేనే తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. కాస్త నలత చేస్తేనే తట్టుకోలేరు. నయమయ్యేదాకా మామూలు మనుషులు కాలేరు. అలాంటిది ఓ తండ్రే పదిహేనేళ్ల కుమార్తెను నరికి చంపడం స్ధానికంగా చర్చనీయాంశం అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ