AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: బీజేపీ Vs టీఆర్ఎస్.. మునుగోడు సెంట్రిక్‌గా హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయం..

తెలంగాణలో మునుగోడు సెంట్రిక్‌గా రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ పోస్టర్ల ప్రచారం మొదలుపెడితే.. లేఖలతో కౌంటర్‌ ఇస్తున్నారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు.

Munugode Bypoll: బీజేపీ Vs టీఆర్ఎస్.. మునుగోడు సెంట్రిక్‌గా హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయం..
Minister Ktr Vs Mp Bandi Sanjay
Shaik Madar Saheb
|

Updated on: Oct 26, 2022 | 9:38 AM

Share

మునుగోడు ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం హైవోల్టేజ్‌లో కొనసాగుతోంది. ఎవర్ని టచ్‌ చేసినా.. హాట్‌ కామెంట్స్‌ హీటెడ్‌ డిబేట్‌ బయటికొస్తోంది. అంతేకాదు పార్టీల క్యాంపేన్‌ కూడా వినూత్న రీతిలో కొనసాగుతోంది. రాత్రికి రాత్రే వెలసే పోస్టర్లు.. వాట్సాప్‌లలో వైరల్‌ అయ్యే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు బైపోల్‌ని బడా దంగల్‌గా మార్చేస్తున్నాయి. ప్రచార పర్వంలో లేఖలు, పోస్టర్లను విడుదల చేస్తూ పార్టీలు పైచేయి సాధించేందుకు చూస్తున్నాయి. లేటెస్టుగా బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌.. కేసీఆర్‌ పాలనపై వాల్‌ పోస్టర్లు విడుదల చేస్తే.. అటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. ప్రధాని మోదీకి రాసిన లేఖని విడుదల చేసి హీట్‌ రెట్టింపు చేశారు. బండి సంజయ్‌.. కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు వదిలితే.. అటు కేటీఆర్‌, ప్రధాని మోదీకి సూటి ప్రశ్నలు సంధించారు.

నేను చెప్పిన అంటే తల నరుక్కుంటా గానీ, ఆ మాట తప్పనని కేసీఆర్‌ చాలా సందర్భాల్లో అన్నారంటూ బండి ఆరోపించారు. అటు కేటీఆర్‌ రోజ్‌గార్‌ మేళా నేపథ్యంలో రాసిన లేఖలో.. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు అని రుజువైందని విమర్శలు చేశారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి, అంబేద్కర్‌కు 125 అడుగుల విగ్రహం కడతానని మోసం చేశారంటూ బండి మరో పోస్టర్‌ విడుదల చేశారు. అటు కేటీఆర్‌ మాత్రం ప్రతి ఎన్నికల ముందు యువతను మోసపుచ్చే ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి నిబద్దతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

తెలంగాణలోని ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్న కేసీఆర్‌ ఎందుకు ఇవ్వలేదంటున్నారు బండి. కాని కేటీఆర్‌ రాసిన లేఖలో మాత్రం 2లక్షల24వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని.. సూమారు 16.5 లక్షల ఉద్యోగ, ఉపాదిఅవకాశాలను ప్రయివేట్ రంగంలో కల్పించామన్నారు. రాష్ట్రంలో ఇన్ని ఇస్తున్నపుడు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలిచ్చింది అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ రూ.3,016 ల నిరుద్యోగభృతి అందిస్తా … ప్రతీ సంవత్సరం టీఎస్‌పిఎస్‌సి ద్వారా ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తాం … తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తా అన్నది కేసీఆరే అని.. అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు బండి. కాని.. ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా సరిగ్గా భర్తీ చేయని మీరు, రోజ్ గార్ మేళా పేరుతో కేవలం 75 వేల మందికి నియామక పత్రాల అందచేయడాన్ని దేశ నిరుద్యోగులు గమనిస్తున్నారని.. ఇదొక క్రూరమైన పరిహాసమన్నారు కేటీఆర్‌.

తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు భూమి, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు, కుటుంబానికో ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని కేసీఆర్‌ ప్రకటించారని బండి ఆరోపించారు. అటు కేటీఆర్‌ మాత్రం యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే మీ పాలనపైన, ప్రభుత్వంపైన తిరగబడే రోజు త్వరలోనే వస్తుందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.

ఇలా ఒకరుపై మరొకరు.. ఒకరి ప్రభుత్వంపై ఇంకొకరు విమర్శలు చేసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మునుగోడు ఎన్నికల్లో గెలవాలనే టార్గెట్‌గా వీరి విమర్శల పర్వం కొనసాగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఆస్కార్ విజేత చంద్రబోస్ వెనుక శక్తి.. కన్నతల్లి అక్షరాలే స్ఫూర్తి
ఆస్కార్ విజేత చంద్రబోస్ వెనుక శక్తి.. కన్నతల్లి అక్షరాలే స్ఫూర్తి
రంజీలో విఫలం.. టీమిండియాలో స్థానం! గంభీర్ ఫేవరిజంపై దుమారం
రంజీలో విఫలం.. టీమిండియాలో స్థానం! గంభీర్ ఫేవరిజంపై దుమారం
లాంచ్‌కు రెడీ అయిన ఒప్పో రెనో సిరీస్‌ ఫోన్‌! ధర ఎంతంటే..?
లాంచ్‌కు రెడీ అయిన ఒప్పో రెనో సిరీస్‌ ఫోన్‌! ధర ఎంతంటే..?
ఆర్టీసీ బస్సులు బంద్..! సంక్రాంతి వేళ ప్రయాణికులకు షాక్
ఆర్టీసీ బస్సులు బంద్..! సంక్రాంతి వేళ ప్రయాణికులకు షాక్
ముంచుకొస్తున్న వాయుగుండం.! తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం.
ముంచుకొస్తున్న వాయుగుండం.! తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం.
స్టార్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్.. రెండు సినిమాలపై భారీ ఆశలు
స్టార్ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్.. రెండు సినిమాలపై భారీ ఆశలు
ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
మీర్జాగూడ వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఎంతమంది చనిపోయారంటే?
మీర్జాగూడ వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఎంతమంది చనిపోయారంటే?
తొలుత బ్యాట్‌తో బీభత్సం.. ఆ తర్వాత 'పుష్ప' సెలబ్రేషన్స్
తొలుత బ్యాట్‌తో బీభత్సం.. ఆ తర్వాత 'పుష్ప' సెలబ్రేషన్స్
గ్రాట్యూటీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
గ్రాట్యూటీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!