Kishan Reddy: కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
బీజేపీ వల్ల సీఎం కేసీఆర్‌కు కొడుకు సీఎం కాలేడనే భయం పట్టుకుందని, సీఎం కుర్చి పోతుందని నిరాశలో ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల, ప్రభుత్వ డబ్బులతో బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో హోర్డింగులు పెట్టారని ఆరోపించారు.
Kishan Reddy on TRS: సీఎం కేసీఆర్.. కొడుకు (కేటీఆర్) సీఎం కాలేడనే నిరాశతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వాగతం పలకడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ వల్ల సీఎం కేసీఆర్‌కు కొడుకు సీఎం కాలేడనే భయం పట్టుకుందని, సీఎం కుర్చి పోతుందని నిరాశలో ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల, ప్రభుత్వ డబ్బులతో బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో హోర్డింగులు పెట్టారని ఆరోపించారు. ఓ పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు మరో పార్టీ ఇలా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సీఎం దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కుటుంబ పార్టీ.. ఎంఐఎంతో కలిసి దిగజారే రాజకీయాలు చేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాము ప్రజాస్వామ్య పద్దతిలో నడుచుకుంటామని తెలిపారు. ఆయన పని అయిపోయిందంటూ పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు కుటుంబ రాజకీయాలు చేయదని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగడం సంతోషకరమని.. ప్రజలంతా దీనికోసం ఎదురుచూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఏడాది, రెండళ్లకు ఈ సమావేశాలు జరుగుతాయని.. కానీ కరోనా కారణంగా రెండేళ్ల నుంచి జరగలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్‌లో జరగడం మంచి పరిణామమని, రాష్ట్రానికి సౌభాగ్యమని తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి