PM Modi-Hyderabad: ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగులు వినూత్న నిరసన

ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన సక్సెస్ చేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ప్రధాని నరేంద్రమోడీ భాగ్యనగర పర్యటన నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పలువురు వినూత్న నిరసన తెలుపుతున్నారు.

PM Modi-Hyderabad:  ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగులు వినూత్న నిరసన
Bye Bye Modi Money Heist P
Follow us

|

Updated on: Jul 02, 2022 | 12:17 PM

PM Modi-Hyderabad Tour: హైదరాబాద్ నగరానికి నేడు ప్రధాని మోడీ రానున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ప్రధానిమోడీ రాకని స్వాగతిస్తూ.. బీజేపీ నేతలు, కార్యకర్తలు కాషాయ జెండాలను, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రధానికి ఘన స్వాగతం తెలిపాడని బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.   ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన సక్సెస్ చేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్న వేళ.. ప్రధాని నరేంద్రమోడీ భాగ్యనగర పర్యటన నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పలువురు వినూత్న నిరసన తెలుపుతున్నారు.

బ్యాంకుల ప్రైవేటీకరణ, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయా సంస్థల ఉద్యోగులు తమ సంస్థల ముందు నిలబడి.. ప్ల కార్డులను ప్రదర్శించి.. నిరసన తెలిపారు. మనీహెస్ట్‌ మాస్క్‌ వేసుకుని వినూత్న రితీలో నిరసన వ్యక్తం చేశారు.

ఇప్పటికేప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ మోడీకి వ్యతిరేకంగా పలు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశాయి. సాలు మోదీ.. సంపకు మోదీ, బై బై మోదీ అంటూ పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. పేరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొననునున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో భారీగా హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’అని పెద్ద పెద్ద అక్షరాలతో నిరసన వ్యక్తం చేశారు. ఇక  ‘బైబై మోదీ అనే హాష్‌ ట్యాగ్‌’తో టివోలీ థియేటర్‌ ఎదురుగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసందే..మరిన్ని