Medak: మెదక్ పర్యటనలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. గెస్ట్ హౌస్ తాళం ఇవ్వని అధికారులు.. తాళం పగులగొట్టిన బీజేపీ శ్రేణులు

కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ కు మెదక్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని గెస్ట్‌హౌజ్‌కు మంత్రి చేరుకున్నప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు తాళం తీయలేదు. దీంతో బీజేపీ శ్రేణులు తాళం పగలకొట్టి కేంద్ర మంత్రిని గెస్ట్ హౌజ్‌లోకి తీసుకెళ్లారు.

Medak: మెదక్ పర్యటనలో కేంద్రమంత్రికి చేదు అనుభవం.. గెస్ట్ హౌస్ తాళం ఇవ్వని అధికారులు.. తాళం పగులగొట్టిన బీజేపీ శ్రేణులు
Central Minister Sanjeev Ku
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2022 | 11:40 AM

Medak District: మెదక్‌ జిల్లా పర్యటనలో కేంద్రమంత్రి సంజీవ్‌కుమార్‌ బాల్యన్‌కు షాక్‌ తగిలింది. కేంద్రమంత్రి బసచేసే గెస్ట్‌హౌఝ్‌ తాళంను ఆర్‌అండ్‌ బీ అధికారులు తీయలేదు. దీంతో వెంటనే అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆర్‌ అండ్‌ బీ తాళం పగులగొట్టి కేంద్రమంత్రిని గెస్ట్‌హౌజ్‌కు తీసుకెళ్లారు.

మెదక్ లో కేంద్ర మత్స్య, పశు సంవర్ధక,పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సంజీవ్ తెలంగాణ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో అవినీతి ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ పథకాలను..  తెలంగాణ లో అమలు చేయడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి లో ముందుకు సాగుతోందన్నారు కేంద్ర మంత్రి.

కేంద్ర ప్రభుత్వ  సహకారంతోనే తెలంగాణ లో పథకాలు అమలు అవుతున్నాయని ..మోడీ నేతృత్వంలో నేషనల్ హైవే లు,రైల్వే లైన్లు అభివృద్ధి చెందాయని ప్రస్తావించారు కేంద్ర మంత్రి. పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రధాని మోడీ సారథ్యంలో జరుగుతున్నాయి.పెట్రోల్, డీజిల్ పై తెలంగాణ సర్కారు ట్యాక్స్ తగ్గించడం లేదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అమలయ్యే ప్రతి సంక్షేమ పథకంలో 60 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..