BJP Sankalp Meeting: బీజేపీ భాగ్యనగర్ డిక్లరేషన్.. విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు.. లక్షలాది మంది హాజరయ్యేలా..
ప్రధాని మోదీ వేదికతోపాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు, వీవీఐపీ, వీ-ఐపీలకు సంబంధించిన వేదికలను పూర్తి చేశారు.
BJP Sankalp Meeting: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు జరగబోతున్న బీజేపీ విజయ సంకల్ప సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 4 లక్షల చదరపు అడుగుల్లో 10 భారీ జర్మన్ టెంట్లు అమరుస్తున్నారు. ప్రధాని మోదీ వేదికతోపాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు, వీవీఐపీ, వీ-ఐపీలకు సంబంధించిన వేదికలను పూర్తి చేశారు. ప్రధాన వేదికతోపాటు ప్రముఖులకు సంబంధించిన షెడ్లు, గుడారాలలో 100 ఏసీలను అమర్చారు. 50 జనరేటర్లను, 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. 2 లక్షలమంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. 30 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాట్లను చేసి ప్రసంగాలు స్పష్టంగా వినపడేలా, వక్తలు కనబడేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవెంట్స్ నిర్వహకులు తెలిపారు. ఇక మైదానంలో ఉండేవారితోపాటు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి సైతం ప్రధాని ప్రసంగం వినిపించేలా స్పీకర్లను ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరయ్యే వారి వాహనాలను పార్కింగ్ కోసం కంటోన్మెంట్ బోర్డు జింఖానా గ్రౌండ్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ , బైసన్‌పోలో గ్రౌండ్స్, మడ్‌ఫోర్ట్‌లోని హాకీ మైదానంతో పాటు JBS పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వెసులుబాటు కల్పించారు.
ఇదిలాఉంటే.. బీజేపీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ సైతం హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి