Hyderabad: గులాబీ, కాషాయం జెండాలతో నిండిపోయిన భాగ్యనగరం.. పోటాపోటీగా బ్యానర్ల ఏర్పాటు..
బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక నేపథ్యంలో గులాబీ శ్రేణులు భారీగా జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీంతో జంక్షన్లలో జండాల వార్ కనిపిస్తోంది.
Hyderabad: తెలంగాణలో పొలిటికల్ ఫ్లెక్సీల వార్ మరింత ముదిరింది. టీఆర్ఎస్ – బీజేపీ (TRS Vs BJP) నేతల విమర్శలు, ప్రతి విమర్శలు ముదిరి ఫ్లెక్సీల వరకు వెళ్లడం.. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా గులాబీ, కషాయం జెండాలే కనిపిస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక నేపథ్యంలో గులాబీ శ్రేణులు భారీగా జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీంతో జంక్షన్లలో జండాల వార్ కనిపిస్తోంది. ఈ జండాల యుద్దానికి కేంద్రంగా నక్లెస్ రోడ్, పలు జంక్షన్లు మారాయి. ఓవైపు గులాబీ, మరోవైపు కాషాయం జండాలు, తోరణాలతో భాగ్యనగరం నిండిపోయింది. కాగా.. నగర వ్యాప్తంగా ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ బీజేపీ కటౌట్లు ఏర్పాట్లు చేయగా.. రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హాకు సపోర్ట్ చేస్తూ టిఆర్ఎస్ ప్లెక్సీలు ఏర్పాటు చేశాయి గులాబీ శ్రేణులు..
ఇటీవల సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా.. హైదరాబాద్‌లో బీజేపీ శ్రేణులు ‘‘సాలు దొర.. సెలవు దొర’’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగంరలోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద డిజిటల్ కౌంట్ డౌన్‌తో బీజేపీ డిసిప్లే ఏర్పాటు చేసింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం ‘‘సాలు మోడీ.. సంపకు మోడీ’’ బై బై మోడీ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో మోడీ వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు సోషల్ మీడియాలో సైతం ఇరు పార్టీల శ్రేణులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి