Telugu News Telangana Telangana Minister KTR satirically Addressing Leaders Of BJP coming to National executive meeting as whatsapp university
Minister KTR: ‘వాట్సాప్ యూనివర్సిటీ’కి స్వాగతం.. ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ రుచి చూడండి: మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అందమైన హైదరాబాద్ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Minister KTR: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో మరింత పొలిటికల్ హీట్‌ను పెంచాయి. బీజేపీ – టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అందమైన హైదరాబాద్ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతమంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జుమ్లా జీవులందరికీ స్వాగతమంటూ పేర్కొన్న కేటీఆర్.. ఇక్కడ ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దంటూ బీజేపీ నేతలకు సూచించారు. ఈ మేరకు యాదాద్రి, పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రం, కాళేశ్వరం ప్రాజెక్టు, టీహబ్ ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. వాటన్నింటిని సందర్శించి పరిశీలించి వారి రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నించండి అంటూ మంత్రి కేటీఆర్ రాశారు.
Welcome the WhatsApp University for its executive council meeting to the beautiful city of Hyderabad
అంతకుముందు ట్విట్టర్ వేదికగా.. తెలంగాణ రాష్ట్రానికి రండి, చూడండి, నేర్చుకోండి(Aao-Dhekho-Seekho) అంటూ కేటీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కొత్త ఆలోచనా విధానానికి తెలంగాణ నుంచి నాంది పలకాలని కోరారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేషం, విభజన అజెండా కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. కాని, పార్టీ DNAలోనే విద్వేషం, సంకుచితత్వం నింపుకున్న మీరు ప్రజలకు మేలు చేసే విషయాలను జాతీయ కార్యవర్గంలో చర్చిస్తారనుకోవడం అత్యాశే అవుతుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని తాను అనుకోవడం లేదని KTR అన్నారు. మీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్‌తో ప్రజలకు ట్రబుల్స్ ఉన్నాయని రాసుకొచ్చారు.