Yashwanth Sinha: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌ సిన్హా.. కేసీఆర్‌ ఘన స్వాగతం.. భారీ ర్యాలీ

Yashwanth Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కాసేపట్లో హైదరాబాద్‌లో పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు..

Yashwanth Sinha: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌ సిన్హా.. కేసీఆర్‌ ఘన స్వాగతం.. భారీ ర్యాలీ
Follow us
Subhash Goud

|

Updated on: Jul 02, 2022 | 12:12 PM

Yashwanth Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కాసేపట్లో హైదరాబాద్‌లో పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. ఆయన రాకకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. యశ్వంత్‌ అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. యశ్వంత్‌ సిన్హా నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. అయితే యశ్వంత్ సిన్హా భాగ్యనగరానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది.

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న యశ్వంత్‌ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు, పలువురు ముఖ్యనేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి జలవిహారం వరకు భారీ బైక్ ర్యాలీతో ఊరేగింపుగా యశ్వంత్ సిన్హాను తీసుకెళ్తున్నారు.

10 వేల మంది టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ

యశ్వంత్‌ సిన్హా రాకతో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది టీఆర్‌ఎస్‌. యశ్వంత్‌కు మద్దతుగా 10 వేల మందితో టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీ బేగంపేట ఎయిర్‌ఫోర్టు, గ్రీన్‌లాండ్స్‌, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, నెక్లెస్‌రోడ్‌ మీదుగా జలవిహార్‌ వరకు యశ్వంత్‌ సిన్హా రోడ్‌షో జరగనుంది.

గులాబీ జెండాలతో రెపరెపలు..

హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన ఓ వైపు బీజేపీ జెండాలు, మరో వైపు టీఆర్‌ఎస్‌ జెండాలు. పోటాపోటీగా ఇరుపార్టీలు జెండాలు ఏర్పాటు చేశాయి. యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాకతో బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌ వరకు టీఆర్‌ఎస్‌ భారీగా జెండాలు ఏర్పాటు చేసింది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పక్కపక్కనే ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు యశ్వంత్‌ సిన్హా ర్యాలీ నేపథ్యంలో గులాబీ జెండాలు ఈ రూట్లో రెపరెపలాడుతున్నాయి.

హైసెక్యూరిటీ జోన్‌గా బేగంపేట

అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాకతో బేగంపేట జోన్‌ హైసెక్యూరిటీ జోన్‌గా మారిపోయింది. వీవీఐపీల రాకతో ఎయిర్‌పోర్టులో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇలా నగరంలో ముఖ్యనేతల సందడి నెలకొనడంతో భాగ్యనగరంలో భద్రతా అధికారుల గుప్పిట్లో ఉండిపోయింది. ఎటు చూసిన ప్రత్యేక తనిఖీలు, వివిధ రకాల ఆంక్షలు ఉన్నాయి.