AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Battery tips: ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా? అస్సలు చేయొద్దు! ఎందుకంటే..

చాలామంది ఫోన్ ను 100 శాతం ఛార్జ్ చేస్తుంటారు. దీనివల్ల బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది అనుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల బ్యాటరీపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. అసలు మొబైల్ ను ఎలా ఛార్జ్ చేయాలి? బ్యాటరీ ఎక్కువకాలం పాటు రావాలంటే ఏం చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Phone Battery tips: ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేస్తున్నారా? అస్సలు చేయొద్దు! ఎందుకంటే..
Phone Battery Tips
Nikhil
|

Updated on: Oct 02, 2025 | 3:42 PM

Share

మొబైల్ కు ఛార్జింగ్ పెట్టే విషయంలో చాలామంది చాలా తప్పులు చేస్తుంటారు.  దీనివల్ల  బ్యాటరీ పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఏళ్లు రావాల్సిన బ్యాటరీ రెండేళ్లలోనే పాడవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ఫోన్ కూడా పాడయ్యా అవకాశం ఉంది. అయితే ఫోన్ ఛార్జింగ్‌ పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెరుగైన బ్యాటరీ లైఫ్ పొందొచ్చు. అదెలాగంటే..

ఫుల్ ఛార్జ్ చెస్తే..

చాలామందికి స్మార్ట్‌ఫోన్‌లను పూర్తిగా ఛార్జ్ చేసే అలవాటు ఉంటుంది . బ్యాటరీ 100 శాతం ఛార్జ్ అయ్యే వరకు ఛార్జర్‌ తీసివేయరు. కొంతమంది రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి  నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు వల్ల మీ  మొబైల్ లోని బ్యాటరీ జీవితకాలం వేగంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసిన ప్రతీసారీ అది అధిక వోల్టేజ్ కు వెళ్లిపోతుంది. అప్పుడు బ్యాటరీలో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. దీనివల్ల ఎక్కువసేపు బ్యాటరీ వస్తుంది. కానీ, క్రమంగా బ్యాటరీ ఛార్జింగ్ సైకిల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. నాలుగేళ్లు రావాల్సిన బ్యాటరీ రెండేళ్లలోనే డెడ్ అయిపోతుంది.  అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేయడం వల్ల కూడా బ్యాటరీ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

ఇలా చేయాలి

  • ఫోన్ బ్యాటరీని ఎప్పుడూ 20 నుంచి 80 శాతం మధ్య ఉంచుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. మొబైల్ బ్యాటరీ ఎప్పుడూ 100 శాతం ఉండకూడదు. అలాగే ఎప్పుడూ 0% కి పడిపోకూడదు. బ్యాటరీ 20% ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టేయాలి. 80% వరకూ వచ్చాక ఆపాలి. ఇలా చేయడం ద్వారా బ్యాటరి జీవితకాలం పెరుగుతుంది. అంతేకాకుండా ఛార్జింగ్  కూడా ఎక్కువ సేపు వస్తుంది.
  • ఇకపోతే ఫోన్ బాగా హీట్ ఎక్కినప్పుడు ఛార్జింగ్ పెట్టకూడదు. అలాగే బాగా చల్లగా ఉన్న టెంపరేచర్ లో కూడా ఛార్జ్ చేయడ అంత మంచిది కాదు.
  • ఫోన్ ఛార్జ్ చేయడానికి కంపెనీ ఇచ్చిన ఛార్జర్ నే వాడాలి. నాసి రకం అడాప్టర్లు వాడితే బ్యాటరీ పాడవుతుంది.
  • ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు మొబైల్ లో ఉండే పవర్ సేవింగ్ మోడ్ ను ఆన్ చేయడం బెటర్. దీనివల్ల బ్యాటరీపై లోడ్ తగ్గుతుంది. తద్వారా బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవ్వకుండా ఉంటుంది.
  • పవర్ బ్యాంక్ లు వాడేవాళ్లు కూడా మంచి కంపెనీ పవర్ బ్యాంకులు వాడాలి. అలగే ఛార్జింగ్ కోసం మంచి డేటా కేబుల్స్ ను వాడాలి. డ్యామేజ్ అయిన డేటా కేబుల్స్ వాడితే బ్యాటరీతో పాటు ఫోన్ కూడా పాడవుతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి