AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. వికీపీడియాకు పోటీగా మరో ప్లాట్‌ఫాం

ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. వికీపీడియాకు పోటీగా మరో ప్లాట్‌ఫాం

Phani CH
|

Updated on: Oct 02, 2025 | 3:19 PM

Share

సంచలనాలకు మారుపేరు ఎలాన్ మస్క్.. మరో సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ ఆన్‌లైన్ విజ్ఞాన సర్వస్వం వికీపీడియాకు పోటీగా, అంతకంటే మెరుగైన ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘గ్రోకిపీడియా’ పేరుతో రానున్న ఈ కొత్త ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియాను తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వికీపీడియాతో పోలిస్తే మరింత విశ్వసనీయమైన, పారదర్శకమైన, కచ్చితమైన సమాచారాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశమని మస్క్ పేర్కొన్నారు. తన సంస్థ అభివృద్ధి చేసిన గ్రోక్ ఏఐ టెక్నాలజీని ఈ ప్లాట్‌ఫామ్‌లో వినియోగించనున్నారు. విశ్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన వివరించారు. మానవాళికి కృత్రిమ మేధస్సును ప్రయోజనకరంగా మార్చాలన్న తన ఆశయానికి అనుగుణంగానే గ్రోకిపీడియా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఎలాన్ మస్క్ ప్రకటనపై ఇంటర్నెట్‌లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు నెటిజన్లు ఆయన ప్రయత్నాన్ని స్వాగతిస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సమాచారం కోసం గ్రోక్ ఏఐ ఇప్పటికే వికీపీడియా డేటా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నప్పుడు.. మీ గ్రోకిపీడియా..దానికంటే ఎలా మెరుగ్గా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గ్రోకిపీడియా రాకతో ఆన్‌లైన్ సమాచార ప్రపంచంలో ఎలాంటి మార్పులు వస్తాయోనని టెక్ నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చీరకట్టులో పురుషుల గర్బా డ్యాన్స్‌.. ఎందుకంటే ??

దసరా రోజు పాలపిట్టను చూడాలి.. ఎందుకంటే ??

భారీ భూకంపం.. 69 మంది మృతి

అమెరికా షట్‌డౌన్‌.. అప్పుడూ ట్రంప్ హయాంలోనే

సింహాద్రి అప్పన్న ఆయుధాలు చూశారా ?? విశేషంగా ఆయుధ పూజ