దసరా రోజు పాలపిట్టను చూడాలి.. ఎందుకంటే ??
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులు వైభవంగా జరగుతున్నాయి. ఈ పది రోజులూ జగన్మాతను రకరకాల రూపాల్లో ఆరాధిస్తారు. దసరా రోజున కుటుంబమంతా నూతన వస్త్రాలు ధరిస్తారు..ఆయుధ పూజ చేస్తారు. చాలామంది కొత్త వాహనాలు దసరా రోజునే కొనుగోలు చేసి.. పూజలు కూడా చేస్తారు. ఈ దసరా వేడుకల్లో మరో ముఖ్యమైన అంశం పాలపిట్ట దర్శనం.
దసరా రోజున ఖచ్చితంగా పాలపిట్టను చూడాలని పురాణాలు చెబుతున్నాయి. మరి దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి..? దీని వెనుక అసలు రహస్యం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపరయుగంలో.. పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా… వాళ్లకు పాలపిట్ట కనిపించిందని మహాభారతం చెబుతోంది. నాటి నుంచి వారు వరుసగా విజయాలు దక్కించుకున్నారని, అందుకే దసరా రోజున తప్పనిసరిగా పాలపిట్టను చూడాలని హిందువుల నమ్మకం. కొందరు దసరా రోజున సాయంత్రం దేవాలయాల్లో జమ్మి చెట్లకు పూజ చేసి… ఆ తర్వాత పాలపిట్ట దర్శనానికి వెళుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో దసరా రోజు ఉదయం లేవగానే పాలపిట్టను చూసేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని, దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అటు..త్రేతా యుగంలో విజయదశమి రోజునే రావణాసురుడిపై.. యుద్ధానికి శ్రీరాముడు బయలుదేరారట. ఆ సమయంలో శ్రీరాముడికి పాలపిట్ట కనిపించిందని చెబుతారు. ఆ యుద్ధంలో రావణాసురుడిని రాముడు మట్టి కరిపిస్తాడు. దీంతో పాలపిట్టను శుభసూచకంగా శ్రీరాముడు భావించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలా చోట్ల దసరా రోజున రావణాసురుడి బొమ్మను దహనం చేస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా షట్‌డౌన్.. అప్పుడూ ట్రంప్ హయాంలోనే
సింహాద్రి అప్పన్న ఆయుధాలు చూశారా ?? విశేషంగా ఆయుధ పూజ
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

