Gold Price: దుమ్ము రేపుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే ??
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. నవరాత్రి, విజయదశమి వేళ పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ.. దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. దీంతో గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేయాలనుకుంటున్న వారు రోజురోజుకూ పెరుగుతున్న రేట్లతో షాక్ అవుతున్నారు. మరీ రేట్లు ఇలా మండిపోతోంటే ఎలారా కొనేది అని తెగ ఫీల్ అవుతున్నారు.
పోనీ పండగ తర్వాత ఏమైనా తగ్గుతాయా అంటే అస్సలు అలాంటి సీన్ లేదని బులియన్ అనలిస్టులు అంటున్నారు. అక్టోబర్ 1, బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,20,730 రూపాయిలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,11,800 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,49,200 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల తులం పసిడి ధర రూ.1,17,600, 22 కేరట్ల ధర రూ. 1,07,810గా ఉంది. ముంబైలో 24 కేరట్ల తులం పసిడి ధర రూ. 1,17,450గా, 22 కేరట్ల ధర రూ.1,07,660గానూ ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1, 17, 450గా ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1, 07, 660 గా ఉంది. బెంగళూరులో 24 కేరట్ల ధర రూ.1,17,450, 22 కేరట్ల ధర రూ.1,07,660 గా ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల ధర రూ.1,17,450, 22 కేరట్ల ధర రూ.1,07,660 గా ఉంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం చేరుతోంది. తులం బంగారం లక్షన్నర వైపు పరుగులు తీస్తోంది. అదే జరిగితే ఇక సామాన్యులు బంగారం గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే. వెండి ధర కూడా భారీగానే పెరుగుతోంది. దీపావళి నాటికి ఈ పసిడి ధర మరింత భగ్గుమనటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం
Alia Bhatt: ఇంట్రస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ఆలియా
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

