AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న హీరోయిన్లు

సొంత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్న హీరోయిన్లు

Phani CH
|

Updated on: Oct 01, 2025 | 6:36 PM

Share

ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం స్పెషల్‌గా కొందరు హీరోయిన్లు ఉండేవాళ్లు.. కానీ ఇప్పుడా అవసరం లేదు. తమ సినిమా కోసం తామే స్పెషల్ బ్యూటీస్‌గా మారిపోతున్నారు స్టార్స్. మరీ ముఖ్యంగా ఓ ప్రొడక్షన్ హౌజ్ వాళ్ళ హీరోయిన్లతోనే స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న కూడా ఈ లిస్టులో చేరిపోయారు. బాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు రష్మిక మందన్న.

థామా సినిమా కోసం ఆమె చేసిన స్పెషల్ సాంగ్ వైరల్ అవుతుందిప్పుడు. అందులో గ్లామర్ షో కూడా బాగానే చేసారు ఈ బ్యూటీ. అక్టోబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్నారు రష్మిక. మ్యాడాక్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో తమ సినిమాల కోసం తామే స్పెషల్ బ్యూటీస్ అవుతున్నారు హీరోయిన్లు. ఇదే మ్యాడాక్ నుంచి వచ్చిన స్త్రీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ కూడా అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేసారు. చివర్లో వచ్చే ఈ పాటకు రెస్పాన్స్ అదిరిపోయింది. స్త్రీ 2లో తమన్నా కూడా స్పెషల్ సాంగ్ చేసారు. భేడియా సినిమాలో కృతి సనన్ సైతం తుముకేశ్వరి అంటూ ఖతర్నాక్ మసాలా సాంగ్ చేసారు. ఈ పాట సినిమాకు బాగా హెల్ప్ అయింది. తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైపోయింది. మొన్న మిరాయ్‌లో వైబ్ ఉంది పాట ఈ స్టైల్‌లోనే వచ్చింది. హీరోయిన్ రితికా నాయక్‌తోనే స్పెషల్ సాంగ్ చేయించారు మేకర్స్. మొత్తానికి ఇదో కొత్త ట్రెండిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాంతార కాంట్రవర్సీ.. చేజేతులా చేసుకున్నాడా

ఓజి కలెక్షన్స్.. ఎంతొచ్చింది.. ఎంత రావాలి..?

రాజా సాబ్ ట్రైలర్.. మారుతి మాయాజాలం..!

RFCలో SSMB29 కొత్త షెడ్యూల్

ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్.. అప్పటి వరకు రెస్ట్..!